రాజమౌళి తర్వాత ఆ రేంజ్ పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. కెజియఫ్ సిరీస్‌తో సంచలనం సృష్టించగా.. సలార్‌తో ప్రభాస్‌కు సూపర్ కంబ్యాక్ సినిమా ఇచ్చాడు. తాజాగా సలార్2, కెజియఫ్ చాప్టర్ 3 గురించి సాలిడ్ అప్టేట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దేవర.. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల అక్టోబర్‌కు దేవర పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పుడు ప్రీ పోన్ కానుందనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అప్పటి వరకు అనుపమా పెద్దగా హద్దులు దాటలేదు. దీంతో.. టిల్లు స్క్వేర్ అనుపమా బోల్డ్‌నెస్ చూసి కుర్రాళ్లకు పిచ్చెక్కిపోయింది. అమ్మడి అందానికి ఫిదా అయ్యారు. ఇక్కడి నుంచి అనుపమా పరమేశ్వరన్ తగ్గేదేలే అంటోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుని రంగంలోకి దించుతున్నారు? అనే న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ మహేష్‌తో నిజంగానే కల్కి కోసం అలా చేయిస్తున్నారా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సూపర్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. తన బర్త్ డే సందర్భంగా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాల అప్టేట్స్ బయటికి రానున్నట్టుగా తెలుస్తోంది. దీంతో రౌడీ ఫ్యాన్స్ రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు.
తాజాగా సలార్ సినిమాలో వరద రాజ మన్నార్ పాత్రలో నటించిన పృధ్వీరాజ్ సుకుమారన్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరొక యూనివర్స్‌తో సలార్ క్రాస్ ఓవర్ ఉంటుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
లేడీ పవర్ స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి.. ఎన్ని కోట్లు ఇచ్చిన సరే, ఓ పని మాత్రం అస్సలు చేయనని తెగేసి చెబుతోందట. లేటెస్ట్‌గా రెండు కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎందుకు?
ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కెరీర్ పీక్స్‌లో ఉంది. త్వరలోనే తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇలాంటి సమయంలో పెళ్లి అనే న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. దీంతో.. తన పెళ్లి వార్తలపై స్పందించింది జాన్వీ.
రాజధాని ఫైల్స్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూసేవారు ఉచితంగా యూట్యూబ్‌లో ఇప్పుడు దాన్ని చూసేయొచ్చు. ఎప్పటి నుంచి అది అందుబాటులో ఉంటోందంటే...?
ఉప్పెన సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు బుచ్చిబాబు.. సెకండ్ సినిమా కోసం చాలా సమయం తీసుకున్నాడు. కానీ కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. మెగా పవర్ స్టార్‌తో సాలిడ్ ఛాన్స్ అందుకున్నాడు. అయితే.. ఈ సినిమా కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చూస్తే ఎవ్వరికైనా షాక్ అవాల్సిందే. భారీ పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు డార్లింగ్. అయినా కూడా మధ్యలో కన్నప్ప కోసం కీలక పాత్రలో కనిపించడానికి రెడీ అవుతున్నాడు. కానీ మూడు రోజులు మాత్రమే అంటున్నారు.
2022లో సంచలనంగా నిలిచిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లే అవుతోంది. కానీ అప్పుడే రీ రిలీజ్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. మరి ఆర్ఆర్ఆర్ సినిమాను ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు? ఇప్పుడే ఎందుకు విడుదల చేస్తున్నారు?
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ పలు ప్రాంతాల్లో జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతామరాజు జిల్లాలో షూటింగ్ జరుగుతుండగా ఆ చిత్ర బృందంపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి.
జనసేనాని కోసం మరో టాలీవుడ్ స్టార్ హీరో మద్దతు తెలిపారు. నేచురల్ స్టార్ నాని ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. మీ పోరాటంలో గెలవాలి అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుంది.
యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ బ్యూటీకి ప్రస్తుతం ఆఫర్లు తగ్గిపోయాయి. కానీ లేటెస్ట్‌గా మరో భారీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత?