»Our Association Showcase Notices For Karate Kalyani
Karate Kalyani : కరాటే కళ్యాణికి మా అసోసియేషన్ షోకాజ్ నోటీసులు
ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ పై సినీనటి కరాటే కళ్యాణి(Karate Kalyani) అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ... క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటిసులు జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ' మా ' అసోసియేషన్ (Ma asosiyesan) అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశించారు.
టాలీవుడ్ సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆగ్రహం వ్యక్తం చేసింది.దివంగత సీనియర్ ఎన్టీఆర్ (Senior NTR)విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయింది. క్రమశిక్షణ ఉల్లంఘన కింద వస్తుందని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కల్యాణికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఖమ్మం(Khammam)లోని లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల పొడవైన శ్రీకృష్ణుని రూపంలోని ఎన్టిఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి తెలంగాణ మంత్రి పువ్వాడ (Minister Puvvada) అజయ్ కుమార్ సన్నాహాలు చేస్తున్న విషయం విదిమే. ఇప్పటికే ఈ విగ్రహావిష్కరణకుగాను జూనియర్ ఎన్టీఆర్కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆహ్వానాన్ని అందించారు. అయితే శ్రీకృష్ణుడు (Srikrsnudu) రూపంలోని ఎన్టిఆర్ విగ్రహావిష్కరణ చేయడంపై కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఆమె యాదవ సంఘాలు, కొన్ని హిందూ సంఘాలతో కలిసి పోరాటం చేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను అడ్డుకుంటామని ఆమె హెచ్చారించారు. కృష్ణుడి రూపంలో తారకరామారావు (Tarakara Rao) విగ్రహాన్ని పెట్టడాన్ని ఆమె తప్పుబట్టారు. ఖమ్మంలో శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టి రామారావు విగ్రహావిష్కరణను నిలిపివేయాలని అఖిల భారత యాదవ సంఘం (Yadava community) జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఆమె డిమాండ్ చేశారు. దేవుడి రూపంలో ఉన్న రాజకీయ వ్యక్తిని ఆరాధిస్తూ తమ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తారని విమర్శించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ‘ మా ‘ అసోసియేషన్ (Ma asosiyesan) నుండి కరాటే కల్యాణి షోకాజ్ నోటీసులను అందుకున్నారు. ఈ వివాదంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ‘ మా ‘ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) ఆదేశించారు.