»Ooru Peru Bhairavakona Movie Review Is Sandeep Kishan A Hit
Ooru Peru Bhairavakona Movie Review: సందీప్ కిషన్ హిట్ కొట్టాడా?
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఫాంటసీ, అతీంద్రీయ శక్తల నేపథ్యంలో సాగుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సందీప్ కిషన్ హిట్ కొట్టాడా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.
చిత్రం:ఊరు పేరు భైరవకోన సినిమా నటీనటులు:సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వైవా హర్ష, వెన్నెల కిషోర్, పీ రవిశంకర్, వడివుక్క రాశి తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: రాజ్ తోట దర్శకత్వం:వీఐ ఆనంద్ నిర్మాతలు:అనిల్ సుంకర, రాజేశ్ దండా ఎడిటింగ్:చోటా కే ప్రసాద్ విడుదల: 16/02/2024
కథ
బసవలింగం(సందీప్ కిషన్) స్టంట్ మాస్టర్‌గా పనిచేస్తుంటాడు. అతను ఓసారి ఆటోలో వెళ్తుంటే.. భూమి(వర్ష బొల్లమ్మ) కనిపిస్తుంది. చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. భూమి హ్యాండ్ బ్యాగ్‌ను ఇద్దరు దొంగలు తీసుకువెళ్లిపోతారు. వాళ్లను పట్టుకుని ఆ బ్యాగ్‌ను బసవ తీసుకుని.. అందులో ఉండే అస్థిపంజరం చూసి షాక్ అవుతాడు. భూమి కోసం బసవ ఒక ఇంటికి వెళ్లి పెళ్లికూతురు నగలు ఎత్తుకుపోతాడు. అతని స్నేహితుడు జాన్(హర్ష)తో ఆ నగలు పట్టుకుని పోలీసులకు దొరక్కుండా పారిపోతుంటారు. దారిలో గీత(కావ్య థాపర్) కనిపిస్తుంది. ఇలా వెళ్తుండగా.. వీళ్లు భైరవకోన అనే గ్రామంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రామంలో వీళ్లకి అన్ని వింతగా కనిపిస్తాయి. మనుషులు కూడా వింతగానే ఉంటారు. అసలు ఆ గ్రామంలో ఎందుకు అందరూ వింతగా ఉన్నారు? భైరవకోనకి బయట ప్రపంచానికి ఎటువంటి సంబంధం ఉంది? ఆ గ్రామంలోనికి వెళ్లిన వాళ్లు తిరిగి బయటకి రాగలరా? అక్కడికి వెళ్లిన వీళ్లు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు? భూమి ఎవరి అస్థిపంజరం అవయావాలు అలా బ్యాగ్‌లో పెట్టుకుని తిరుగుతుంది? ఆమె కథ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఊరు పేరు భైరవకోన సినిమా థియేటర్లో చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఈ సినిమా ఫాంటసీ, అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో సాగుతుంది. అయితే ఈ చిత్రంలో కథ ఎటు నుంచి ఎటు వెళ్తుందో, ఏం జరుగుతుందో అర్థం కాదు. కథలో భావోద్వేగాలు కూడా మిస్ అయినట్లు అనిపిస్తుంది. అసలు ఇది ఫాంటసీ కథనే అనే సందేహం ప్రేక్షకుల్లో కలుగుతుంది. వినోద సన్నివేశాలు సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. హీరోహీరోయిన్ల మధ్య ఎలాంటి భావోద్వేగం ఉండదు. వాళ్ల ప్రేమ సాదా సీదాగా ఉంటుంది. దర్శకుడు చెప్పదలుచుకున్న పాయంట్ సరిగ్గా చెప్పలేకపోయాడనిపిస్తుంది. ఫస్టాప్ ఒకే అనిపించినా.. సెకండాఫ్ అంతగా ఆకట్టుకోదు. అన్నింటికి మించి క్లైమాక్స్ ఆకట్టుకోదు. కథలో ట్విస్ట్‌లు ఉన్నప్పటికీ అవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవు.
ఎవరెలా చేశారంటే?
సందీప్ కిషన్ బెస్ట్ ఫర్మామెన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి సినిమాలో అతని కష్టం ఎలా కనబడుతుందో.. ఈ సినిమాలో కూడా అంతే. భూమి పాత్రలో వర్ష అదరగొట్టేసింది. కావ్య థాపర్‌కి కూడా ఈ సినిమాలో కావలసినంత స్క్రీన్ స్పేస్ దొరికింది. వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. మిగతా నటీనటులు వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు
టెక్నికల్ విషయానికొస్తే సినిమాలో పాటలు బాగున్నాయి. బీజీఎం కూడా ఆకట్టుకుంటుంది. కెమెరా వర్క్ పర్లేదు అనిపించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ఒకే అన్నట్లుగానే ఉన్నాయి.