National Awards: ఒక్క డైలాగ్తో ఆ సినిమా జాతీయ అవార్డు కోల్పోయింది..!
69వ జాతీయ చలనచిత్ర అవార్డులు తాజాగా ప్రకటించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ దాదాపు 10కి పైగా అవార్డులు గెలుచుకొని సత్తా చాటింది. చాలా మంచి సినిమాలను గుర్తించి వాటికి అవార్డులు ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయమే. కానీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న కొన్ని సినిమాలకు అవార్డులు రాకపోవడం మాత్రం అందరినీ షాకింగ్ కి గురి చేసింది.
విమర్శకుల ప్రశంసలు పొందిన సర్పత్తా, జై భీమ్ లాంటి సినిమాలను జాతీయ అవార్డుల్లో గుర్తించనే లేదు. తమిళ సినిమాకి ఒక్క దానికి కూడా అవార్డు రాకపోవడంతో, వారంతా నిరాశకు గురయ్యారు. వేరే సినిమాలకు రాలేదు అంటే సరే, కానీ జై భీమ్ సినిమాకి ఎందుకు అవార్డు రాలేదు అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే దానికి అవార్డు ఇవ్వకపోవడానికి కారణం ఉందని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ సినిమాలో ఈ ఒక్క సీన్ ఉందని అందుకే సినిమాకు జాతీయ అవార్డు రాకుండా పోయిందని నెటిజన్లు అంటున్నారు. హిందీలో మాట్లాడినందుకు ప్రకాష్ రాజ్ ఒక వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి, తమిళంలో మాట్లాడమని అడిగే సన్నివేశం ఉంది. ఈ వివాదాస్పద సన్నివేశం కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని, జాతీయ జ్యూరీని కూడా చికాకు పెట్టే అవకాశం ఉందని, అందుకే వారు సినిమాను చెల్లుబాటు చేయకుండా తప్పించుకోగలిగారని నెటిజన్లు అంటున్నారు. నెటిజన్లు అనుకుంటున్న ఈ కారణం నిజం కాకపోవచ్చు. మరి అలా అయితే ఇంత మంచి సినిమాకు అవార్డు ఎందుకు ఇవ్వలేదో ఆ కమిటీకే తెలియాలి.