Jr.NTR : ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివతో 30వ సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గానే ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న కాంబో కావడంతో.. ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు అభిమానులు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివతో 30వ సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గానే ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయింది. జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న కాంబో కావడంతో.. ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు అభిమానులు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత 31వ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్నాడు తారక్. ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీగా ప్లాన్ చేస్తోంది. ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయడం పక్కా. దాంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. డైరెక్టర్ ఎవరనేది తెలియకపోయినా.. ఓ బడా నిర్మాణ సంస్థ మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా ఫిక్స్ చేసుకుందని తెలుస్తోంది. టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఎన్టీఆర్‌తో బిగ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడట. ఈయన ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్‌కు ప్రత్యేకంగా ముంబై నుండి విచ్చేసారు. దాంతో ఈ కాంబినేషన్ ఫిక్స్ అయిపోయిందనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌తో ఆదిపురుష్ నిర్మిస్తున్న టీ సిరీస్ సంస్థ.. ఇటీవలె అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగాతో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఇక ఇప్పుడు ఓ బడా డైరెక్టర్‌తో ఎన్టీఆర్‌ను కూడా లైన్లో పెట్టిటనట్టు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని అంటున్నారు.