నితిన్(Nitin) తన ఫ్యాన్స్‌కు ఒకే రోజు మూడు గుడ్‌న్యూస్‌లు చెప్పాడు. తన 32వ సినిమా టైటిల్(Movie Title), రిలీజ్ డేట్, ఫస్ట్ లుక్ పోస్టర్ (First Look Poster)ను ఒకేసారి విడుదల చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. వక్కంతం వంశీ (Vakkantam Vamsi) దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీకి `ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్` (Extra Ordinary Man)అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆర్డినరీ మేన్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు.
ఇప్పటికే ఈ మూవీ 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. శ్రీలీల (srileela) ఇందులో కథానాయికగా చేస్తోంది. ఆదివారం ఈ మూవీ టైటిల్(Movie Title), ఫస్ట్ లుక్ పోస్టర్(First Look Poster)ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో నితిన్(Nitin) రెండు డిఫరెంట్ లుక్స్‌తో కనిపిస్తున్నాడు. ఒక దానిలో హెయిర్ స్టైల్, గడ్డంతో చాలా సీరియస్‌గా ఉన్నాడు. మరో పోస్టర్లో గడ్డం లేకుండా ఉన్నాడు.
నితిన్(Nitin) ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రలో ఆకట్టుకోబోతున్నారని పోస్టర్(First Look Poster)ను చూస్తేనే తెలుస్తోంది. ఈ మూవీని డిసెంబర్ 23వ తేదిన విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హరీష్ జైరాజ్ ఈ చిత్రానికి మ్యూజిక్ (MUsic) అందిస్తున్నారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.