»Niharikas Second Marriage But Sensational Comments Of Venu Swamy
Venu Swamy : నిహారిక రెండో పెళ్లి.. కానీ? వేణు స్వామి సంచలన కామెంట్స్
మెగా ఫ్యామిలీలో విడాకుల వ్యవహారం ఎప్పుడు హాట్ టాపికే.దీంతో నిహారిక రెండో పెళ్లి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దీని పై కూడా వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశాడు.
సోషల్ మీడియా పుణ్యమా అని వేణు స్వామి (Venu Swamy) చాలా ఫేమస్ అయిపోయాడు. స్టార్ సెలబ్రిటీస్ పై ఈయన చేసే కామెంట్స్ ఎప్పుడూ వైరల్ అవుతునే ఉంటాయి. ఆయన చెప్పేది అప్పుడప్పుడు నిజం అవుతుండడంతో.. సెలబ్రిటీస్ అంతా ఆయన వెనకలా పడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు వేణు స్వామితో పూజలు చేయించుకుంటున్నారు. రష్మిక, డింపుల్ హయాతి, నిధి అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా అతనితో పరిహార పూజలు చేయించుకున్నారు.
అందుకు సంబంధించిన ఎన్నో వీడియో సోషల్ మీడియాలో ఉన్నాయి. మొత్తంగా ఈ జ్యోతిష్యుడు (astrologer) చెప్పే హీరో, హీరోయిన్ల జాతకాలు ఎప్పటికప్పుడు హాట్ టాపికేనని చెప్పాలి. ఇక ఇప్పుడు నిహారిక రెండో పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో వేణు స్వామి చెప్పినట్టుగానే నిహారిక (Niharika) ,చైతన్య జొన్నలగడ్డలు త్వరలో విడిపోయి.. ఆయన మాటలను నిజం చేశారు. దాంతో ఆయన చెప్పిన మాటలు మరోసారి వైరల్ అయ్యాయి. ఇక నిహారిక రెండో పెళ్లి కూడా చేసుకుంటుందని, దానిలో కూడా ఆమెకు కాస్త చికాకులు, చిక్కులు తప్పవని చెబుతున్నాడు వేణుస్వామి. పిల్లల విషయంలో నిహారిక కాస్త ఇబ్బందులు పడాల్సి వస్తుందని జాతకం చెప్పాడు వేణు స్వామి. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.
ఇకపోతే.. నాగ చైతన్య, సమంత.. ధనుష్, ఐశ్వర్య విడాకుల తర్వాత నిహారిక, చైతన్య (Chaitanya) డివోర్స్ ఎక్కువగా షాక్ గురి చేసిన విడాకులు అని చెప్పొచ్చు. 2020 సంవత్సరం, రాజస్థాన్ ఉదయపూర్‌లో నిహారిక, చైతన్యల పెళ్లి పెద్దల సమక్షంలో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత కొంత వరకు బాగానే ఉన్నా.. ఇద్దరికీ పడకపోవడంతో.. ఫైనల్‌గా మే నెలలో మ్యూచువల్ డైవర్స్ కోసం అప్లై చేశారు. ఇటీవలె తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని.. తమకు సపోర్ట్‌గా నిలిచిన ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్‌కు థ్యాంక్స్ చెబుతూ.. సోషల్ మీడియాలో నోట్ రిలీజ్ చేశారు నిహారిక, చైతన్య. ఇక నుంచి కొత్తగా తమ జీవితాలను ప్రారంభించబోతున్నామని.. తమ వ్యక్తిగత జీవితంలో ప్రైవసీ కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.