Charan-Tarak : ఇక పై చరణ్, తారక్ 100 కోట్ల హీరోలు!?
Charan-Tarak : ప్రస్తుతం వంద కోట్లు అందుకుంటున్న హీరోల్లో.. టాలీవుడ్ నుంచి ప్రభాస్ ముందు వరుసలో ఉన్నాడు. ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్లు అందుకుంటున్నాడు. ప్రభాస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంద కోట్లు తీసుకోబోతున్నాడు. పుష్ప2 కోసం అంత డిమాండ్ చేస్తున్నాడని వినిస్తున్నా.. సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ కోసం.. ఏకంగా 120 కోట్లు అందుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం వంద కోట్లు అందుకుంటున్న హీరోల్లో.. టాలీవుడ్ నుంచి ప్రభాస్ ముందు వరుసలో ఉన్నాడు. ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్లు అందుకుంటున్నాడు. ప్రభాస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంద కోట్లు తీసుకోబోతున్నాడు. పుష్ప2 కోసం అంత డిమాండ్ చేస్తున్నాడని వినిస్తున్నా.. సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ కోసం.. ఏకంగా 120 కోట్లు అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా చేరబోతున్నారా అంటే.. ఔననే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకోవడంతో.. ఒక్కసారిగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు తారక్, చరణ్. అంతేకాదు ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు రామ్ చరణ్. ఎన్టీఆర్‌కు కూడా హాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి. దాంతో ఈ ఇద్దరి రెమ్యూనరేషన్‌ను ట్రిపుల్ ఆర్ మూవీ డబుల్, ట్రిపుల్ చేసేసినట్టే. హాలీవుడ్ సంగతి పక్కన పెడితే.. ఈ స్టార్ హీరోలు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం వంద కోట్లు డిమాండ్ చేసే ఛాన్స్ ఉందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఒక్కొకరు 45 కోట్ల పారితోషికం అందున్నారు. దాంతో నెక్స్ట్ వంద కోట్లు అందుకోవడం పక్కా అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివతో ఓ సినిమా చేస్తుండగా.. చరణ్, బుచ్చిబాబుతో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలకు వీళ్ల పారితోషికం ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్క సినిమాల పరంగానే కాదు.. కమర్షియల్‌గా వీళ్ల బ్రాండ్ వ్యాల్యూ మరింతగా పెరిగిందని అంటున్నారు. ఒక్కో యాడ్‌కు 3, 4 కోట్లు తీసుకునే చరణ్, తారక్.. ఇక పై 7, 8 కోట్లు తీసుకోవడం ఖాయమంటున్నారు. ఆస్కార్ లెవల్లో ఇద్దరి పేర్లు మార్మోగిపోవడంతో.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్రాండ్స్.. చరణ్, తారక్ కోసం క్యూ కడుతున్నాయట. ఏదేమైనా.. చరణ్, తారక్ గ్లోబల్ క్రెడిట్.. రాజమౌళికే సొంతం అని చెప్పొచ్చు.