టాలీవుడ్(Tollywood) లో కొత్త సినిమాల జోరు కొనసాగుతోంది. కొత్త రకం చిత్రాలు(Movies) ప్రేక్షకుల ముందు నిలుస్తున్నాయి. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడానికి దండమూడి బాక్సాఫీస్ నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ నుంచి నిర్మితమవుతోన్న తొలి సినిమా(Movie) 'కథ వెనుక కథ'. ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ శుక్రవారం రిలీజ్ చేసింది.
టాలీవుడ్(Tollywood) లో కొత్త సినిమాల జోరు కొనసాగుతోంది. కొత్త రకం చిత్రాలు(Movies) ప్రేక్షకుల ముందు నిలుస్తున్నాయి. కొత్త టాలెంట్ సినీ ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. ఇటువంటి కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడానికి దండమూడి బాక్సాఫీస్ నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ నుంచి నిర్మితమవుతోన్న తొలి సినిమా(Movie) ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ కీలక పాత్రల్లో ఈ సినిమాలో కనించనున్నారు. ఈ సినిమా(Movie)కు యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.
కథ వెనుక కథ సినిమా(Movie) సస్పెన్స్ థ్రిల్లర్(Suspence Thriller) కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ సినిమాను అవనింద్ర కుమార్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా టీజర్(Movie teaser) ను స్టార్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని(Gopichand malineni) శుక్రవారం రిలీజ్ చేశారు. టీజర్(Teaser) చాలా ఆసక్తిగా ఉంది. సినిమా విజయం సాధించాలని గోపీచంద్ మలినేని(Gopichand malineni) ఆశీర్వదించారు. 75 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్(Teaser) అద్భుతంగా ఉంది.
సిటీలో చాలా మిస్సింగ్ కేసులు నమోదవుతుంటాయి. అందులో అమ్మాయిలను హత్యలు చేస్తున్న హంతకుడెవరో పోలీసులకు అంతు చిక్కకుండా ఉంటుంది. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఈ కేసును పరిష్కరిస్తాడు. ఇందులో పోలీస్ గా సునీల్ కనిపించనున్నారు. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా(Movie)ను తెరకెక్కించారు. త్వరలోనే ఈ సినిమా(Movie) తేదీని ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్(Music) అందిస్తున్నారు.