Animal: లైన్ క్లియర్.. ఓటిటిలోకి వచ్చేస్తున్న అనిమల్!
ఫైనల్‌గా అనిమల్ ఓటిటి రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చిన అనిమల్ ఓటిటి వెర్షన్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే ఓటిటిలో అనిమల్ రన్ టైం పెరగనుంది.
Animal: అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చేసింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా.. భారీ అంచనాలతో విడుదల అయింది. అందుకు తగ్గట్టే భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర 900 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. థియేటర్లో దుమ్ములేపిన అనిమల్ ఓటిటి వెర్షన్ కోసం డిజిటల్ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా థియేటర్ వెర్షన్ రన్ టైం మూడు గంటల 21 నిమిషాలు ఉండగా.. ఓటిటి వెర్షన్ మరింత లాంగ్ రన్ టైంతో వచ్చే ఛాన్స్ ఉందని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఎలాంటి కట్స్ లేకుండా అనిమల్ డిజిటల్ ఎంట్రీ ఇస్తే.. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసిన వారు కూడా ఓటిటిలో ఈ సినిమాను చూడడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
అయితే.. ముందు నుంచి ఈ సినిమా సంక్రాంతికి ఓటిటిలోకి వచ్చే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. ఒకవేళ సంక్రాంతికి కుదరకపోతే.. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కానున్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పుడిదే నిజమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అనిమిల్ ఓటిటి వెర్షన్ అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అయితే.. ఓటిటిలో కోసం కొన్ని అదనపు సీన్లు యాడ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ఓటిటి వెర్షన్ మూడున్నర గంటల నిడివి ఉండనుంది.