Kangana Ranaut: డేటింగ్లో ఉన్నాను.. కానీ అతను కాదు!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏం మాట్లాడిని కుండ బద్దలు కొట్టినట్టుగా చెబుతుంది. ఎలాంటి విషయమైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ తాను ఓ వ్యక్తితో డేటింగ్లో ఉన్నానని స్పష్టం చేసింది.
Kangana Ranaut: చివరగా హిట్ సీక్వెల్ చంద్రముఖి 2తో ప్రేక్షకులను అలరించిన హాట్ బ్యూటీ కంగనా రనౌత్.. ప్రస్తుతం ఇందిరా గాంధీ బయోపిక్ ఆధారంగా స్వీయ దర్శకత్వంలో ఎమర్జెన్సీ అనే సినిమా చేస్తోంది. నవంబర్ 24నే రిలీజ్ కావాల్సిన ఎమర్జెన్సీ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా జూన్ 14న ఎమర్జెన్సీ రిలీజ్ కానుందని రీసెంట్‌గానే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. ఖచ్చితంగా ఈ సినిమాతో కంగనా సత్తా చాటుతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగానే.. కంగన చేసే కామెంట్స్‌తో తరచుగా వార్తల్లో నిలుస్తునే ఉంటుంది. ఆ మధ్య ఇండైరెక్ట్‌గా ఓ బాలీవుడ్ స్టార్ హీరో తరచుగా నా ఇంటికి వచ్చేవాడు.. డేట్ చేయమంటూ వేడుకునేవాడు.. అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ యంగ్ మరెవరో కాదు.. రణబీర్ కపూర్ అనే కామెంట్స్ రావడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ప్రస్తుతం కంగనా రనౌత్ ఎవరితో డేటింగ్లో ఉంది? ఒరిజినల్ ప్రేమ కహానీ ఏంటనేది? ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది కంగనా. ఈనెల 22న అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైంది కంగనా. ఆ సమయంలో అక్కడే ఉన్న ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టితో ఓ ఫోటోకు పోజులిచ్చింది. ఇంకేముంది.. కంగనా అతనితో డేటింగ్లో ఉందంటూ కామెంట్స్ ఊపందుకున్నాయి. దీంతో ఈ వార్తలపై కంగనా రియాక్ట్ అయింది. ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చేసింది. అతనికి ఇప్పటికే పెళ్లయింది, దయచేసి ఇలాంటి వార్తలు ఎవరూ నమ్మవద్దని కోరింది. కానీ తాను మాత్రం మరో వ్యక్తితో డేటింగ్లో ఉన్నానని.. సరైన సమయం వచ్చినప్పుడు తానే చెబుతానని చెప్పుకొచ్చింది. మరి కంగనా ఎవరితో ప్రేమలో ఉందో తెలియాలంటే.. అమ్మడు చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే.