అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. వచ్చే సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా రాబోతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. తాజాగా ఈ సినిమా పై బిగ్ అప్టేట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.
‘జై బాలయ్య, త్వరలో తొడ గొట్టి దుమ్ములేపే టైం వచ్చిందిరో..’ అంటూ ట్వీట్ చేసాడు. దాంతో ఈ చిత్రం ఫస్ట్ సింగిల్.. జై బాలయ్య అంటూ సాగేలా ఉంటుందని అంటున్నారు. అతి త్వరలోనే ఆ సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ జై బాలయ్య.. అనే నినాదంతో సాంగ్ ఉంటే మాత్రం థియేటర్ బాక్సులు బద్దలవడం ఖాయమంటున్నారు.
ఇదిలా ఉంటే.. వీరసింహారెడ్డి తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 108వ సినిమా చేయబోతున్నారు బాలయ్య. ఎఫ్3 వంటి కామెడీ ఎంటర్టైనర్ తర్వాత బాలయ్యతో భారీ యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు అనిల్. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి కూడా ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న గ్రాండ్గా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్టు టాక్.
ఇక ఈ చిత్రంలో బాలయ్య కూతురుగా ‘పెళ్లిసందD’ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. బాలయ్య సరసన హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకు కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో ఎన్బీకె 108 పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.