»Nandamuri Fans Get Ready Prepare For Mokshagna Entry
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్ గెట్ రెడీ.. మోక్షజ్ఙ ఎంట్రీకి రంగం సిద్ధం?
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్దమవుతోందా? అంటే, ఔననే చెప్పాలి. అందుకు కారణం లేకపోలేదు. దాన్ని బట్టి ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీకి కసరత్తులు జరుగుతున్నాయని చెప్పొచ్చు.
సీనియర్ హీరోల్లో బాలకృష్ణ (Balakrishna) తనయుడి ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ గురించి వార్తలు వస్తునే ఉన్నాయి. కాకపోతే మోక్షజ్ఙ కాస్త బొద్దుగా ఉండడంతో, ఫిజికల్‌గా రెడీగా లేనట్టుగా ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు మోక్షజ్ఙలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. చాలా వరకు వెయిట్ లాస్ అయ్యాడు. అందుకే ఎప్పుడు కూడా సోషల్ మీడియాకు, కెమెరాకు దూరంగా ఉండే ఈ నందమూరి వారసుడు, ఈ మధ్య మాత్రం ఎక్కడో ఓ చోట కనిపిస్తునే ఉన్నాడు. గత వారం, పది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతునే ఉన్నాడు మోక్షజ్ఞ (Mokshagna).
సుహాసిని కొడుకు పెళ్ళిలో ఎన్టీఆర్‌ని హత్తుకొని దిగిన ఫోటో చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక రీసెంట్గా బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘భగవంత్ కేసరి’ సెట్స్‌లో శ్రీలీలతో కలిసి కనిపించాడు. అలాగే తాతగారు స్మారక నాణేం లాంచ్ ఈవెంట్లో కూడా పాల్గొన్నాడు. ఇక అంతకు మించి అన్నట్టు తండ్రి బాలయ్యతో కలిసి మోక్షజ్ఞ ఎయిర్ పోర్ట్‌లో నడిచొస్తున్న వీడియో మరింత వైరల్‌గా మారింది.
ఇలా ఏదో ఓ విధంగా కెమెరాకు చిక్కుతునే ఉన్నాడు మోక్షజ్ఞ. గతంలో ఎప్పుడు కూడా ఇలా ఔట్ ఫోకస్ అవలేదు. కానీ ఇప్పుడు మాత్రం వెయిట్ లాస్ అయిన హీరో కటౌట్‌తో కనిపిస్తున్నాడు. ఈ లెక్కన మోక్షజ్ఞ హీరోగా లాంచ్ అయ్యే సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది. అందుకే.. ఇప్పుడు కావాలనే కెమెరా ముందుకు వస్తున్నాడని అంటున్నారు. కాబట్టి.. ఈ ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్లో నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ రాబోతోందని చెప్పొచ్చు. బహుశా ఆదిత్య 369 సీక్వెల్‌గా రానున్న ఆదిత్య 999 సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాక్. ఏదేమైనా మోక్షజ్ఞ లుక్ చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు అభిమానులు.