Nagarjuna: అమ్మో.. కింగ్ ధరించిన షర్ట్ ఇన్ని లక్షలా!
వీకెండ్ వస్తే ఎవరు ఎలిమినేట్ అవుతారని కొందరు బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తే.. మరికొందరు కింగ్ నాగార్జున షర్ట్స్ గురించి వెయిట్ చేస్తుంటారు. నాగార్జున వీకెండ్లో ధరించే ఈ షర్ట్ ధర ఎంత తెలుసుకుందాం.
Nagarjuna: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మొదటిసారి 14మందిని హౌస్‌లో పంపగా.. అందులో ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. తర్వాత బిగ్ బాస్ 2.0 అంటూ మినీ లాంచ్ మొదలుపెట్టారు. ఈ మినీ లాంచ్‌లో కొత్తగా ఐదుగురు కంటెస్టంట్స్ హౌస్ అడుగుపెట్టారు. ఈ సీజన్లో కంటెస్టంట్స్‌తో పాటు నెటిజన్లకు కూడా బిగ్ బాస్ ట్విస్ట్‌లు మీద ట్విస్ట్‌లు ఇస్తున్నాడు. కింగ్ నాగార్జున తనదైన స్టైలిష్ యాంకరింగ్‌తోపాటు డ్రెస్సింగ్‌తో అందరినీ ఆకర్షిస్తున్నాడు. వీకెండ్లో నాగార్జున ధరించే షర్ట్ల కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు.
హీరోలు ధరించే షర్ట్, వాచ్ వంటివి నెటిజన్లుకు నచ్చినట్లయితే వాటిని వెతికి ఆన్లైన్లో వెతుకుతుంటారు. ఈ డ్రస్ ధర ఎంత ఉంటుంది. ఎక్కడ దొరుకుతుందని నెటిజన్లు వెతకడం మొదలుపెడతారు. కింగ్ నాగార్జున ఆదివారం ధరించిన ఓ షర్ట్ నెటిజన్లను తెగ ఆకర్షించింది. లూయిస్ వ్యూట్టన్ బ్రాండ్‌కు చెందిన ఈ షర్ట్ ధర తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఈ షర్ట్ ఖరీదు అక్షరాలు రెండు లక్షల పైమాటే. దీని రేటు చూసి అబ్బాయిలు ఇలాంటి షర్ట్‌లను చూసి ఆనందించాలి. అంతే తప్ప కొనుక్కోని ధరించాలని ఆశపడకూడదని కామెంట్లు చేస్తున్నారు. మన్మధుడు ఎలాంటి షర్ట్ ధరించిన ఆ లుక్ వేరే .