ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూలిపాళ్ల ఇద్దరు దొరికిపోయారనే న్యూస్ వైరల్‌గా మారింది. ఈ ఇద్దరు కలిసి దిగిన ఫోటో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సమంతతో విడిపోయిన తర్వాత.. చైతన్య, శోభితతో డేటింగ్ చేస్తున్నాడని.. గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉంది. సామ్‌తో విడాకుల తర్వాత చై ఒంటరిగానే ఉంటున్నాడని అనుకున్నారు అంతా.
కానీ ఆ మధ్య తెలుగు బ్యూటీ శోభితతో చైతన్య సీక్రెట్‌గా ఎఫైర్ మెయింటేన్ చేస్తున్నాడనే వార్తలు వినిపించాయి. అయాతే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. ఇప్పటి వరకు స్పందించలేదు చై. దాంతో సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ఎఫైర్ తెరపైకి వస్తునే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తే ఇది నిజమేనా అని అనిపిస్తోంది.
ఈ ఇద్దరు కలిసి పక్కపక్కనే ఉండడం.. అది కూడా విదేశాల్లో ఆ ఫోటో దిగినట్టు ఉంది. అది కూడా చై బర్త్ డే సంర్భంగా ఈ ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. దాంతో ఇద్దరి మధ్య ఎఫైర్ నిజమేననే నిర్ధారణకు వస్తున్నారు నెటిజన్స్. కానీ అదిఎడిట్ చేసిన పిక్ అని అంటున్నారు కొందరు. ఫోటోలో అది క్లియర్‌గా కనిపిస్తోందని చెబుతున్నారు.
ఈ ఫోటో ఒరిజినల్లా లేకపోయినా.. దీని పై సమంత, అక్కినేని ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తు.. గట్టిగానే వాదించుకుందున్నారు. సమంతను సపోర్ట్ చేస్తూ కొంతమంది.. చైతన్యను అండగా మరికొంతమంది కౌంటర్స్ వేసుకుంటున్నారు. దాంతో మరోసారి చైతన్య-శోభిత ఎఫైర్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.