అక్కినేని నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ పోతున్నాడు. అలాగే కొన్ని బిజినెస్‌లు కూడా చేస్తున్నాడు. అంతేకాదు.. ఓటిటిలోకి కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. చైతన్య నటించిన 'ధూత' సిరీస్ ప్రస్తుతం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.
గత కొంత కాలంగా అక్కినేని హీరోలు బ్యాడ్ టైం ఫేజ్ చేస్తున్నారు. తండ్రి నాగార్జునతో పాటు.. వారసులు నాగ చైతన్య, అఖిల్ కూడా సరైన విజయాలు అందుకోలేకపోతున్నారు. అందుకే.. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌తో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు. ప్రస్తుతం ‘కార్తికేయ2’తో పాన్ ఇండియా హిట్ అందుకున్న దర్శకుడు చందు మొండేటితో ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. ప్రముఖ నిర్మాత అల్లు అరవింత్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చైతూ జాలరీగా కనిపించనున్నాడు.
ఇప్పటికే రిలీజ్ చేసిన రఫ్ లుక్‌లో చైతూ అదిరిపోయాడు. ఇదిలా ఉండగానే.. ఓటిటి ఎంట్రీ కూడా ఇచ్చేశాడు చైతన్య. అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి హిట్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్, దూత వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ పాజిటవ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రజెంట్ జర్నలిజం ఎలా ఉంది? అనేది చూపిస్తూ.. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని రాసుకున్నాడు విక్రమ్.
అవినీతి చేస్తూ.. లంచాలు తీసుకొనే జర్నలిస్ట్‌గా కనిపిస్తూ.. అద్భుతమైన్ పర్ఫార్మెన్స్ చేశాడని అంటున్నారు. మొత్తంగా దూత సిరీస్ బాగుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి.. వరుస సినిమాలతో ఫ్లాప్‌లో ఉన్న నాగ చైతన్య.. ఎట్టకేలకు ఈ సిరీస్‌తో హిట్ అందుకున్నట్లేని చెప్పొచ్చు. ఇక తండేల్ కూడా హిట్ అయితే.. చైతన్య సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో పాటు.. పాన్ ఇండియా స్టార్డమ్ అందుకోవడం పక్కా అంటున్నారు.