Nagarjuna: కొత్త డైరెక్టర్ తో నాగ్.. వర్కౌట్ అవుతుందా?
అక్కినేని నాగార్జున హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. ఆయన చివరగా నటించి ఘోస్ట్ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. చైతూ తో కలిసి చేసిన బంగార్రాజు ఆయన లాస్ట్ హిట్ మూవీగా చెప్పొచ్చు.
నాగ్ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గతంలో ఆయన డైరెక్టర్ ప్రసన్నకుమార్ బెజవాడతో ఓ సినిమా చేస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. నాగ్ సినిమా అయితే ఉంది కానీ, అది ప్రసన్నకుమార్ తో కాదట. ఆయనతో అనుకున్న కథనే మరో డైరెక్టర్ తో చేస్తున్నారట. అది కూడా కొత్త డైరెక్టర్ కావడం విశేషం. ఈ మూవీ అప్ డేట్ ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ తో నాగ్ సినిమా చేయాలనుకోవడం విశేషం. గతంలో కొరియోగ్రాఫర్ లారెన్స్ తో సినిమా చేసి హిట్ కొట్టిన నాగ్, ఈ సారి ఎన్నో సూపర్ హిట్ పాటలకు తన డ్యాన్స్‌తో ఆజ్యం పోసిన విజయ్ బన్నీ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. మలయాళంలో సూపర్ హిట్టయిన ఓ సినిమాకు రీమేక్ అని కూడా తెలుస్తుంది. కాగా విజయ్ బన్నీ తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేసినట్లు, కేవలం ఆ మలయాళ సినిమా కోర్ పాయింట్‌ను మాత్రమే తీసుకున్నట్లు ఇన్సైడ్ టాక్. మరి ఈ ప్రయోగం ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.