బాలీవుడ్ పరిశ్రమలో బయటకి తమ సంబంధాన్ని వెలువరించని జంటలు చాలానే ఉన్నాయి. వారి బంధం బయటపడకుండా చాలా జాగ్రత్తగా కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అవి బయటపడుతుంటాయి.
Mrunal thakur: బాలీవుడ్ పరిశ్రమలో బయటకి తమ సంబంధాన్ని వెలువరించని జంటలు చాలానే ఉన్నాయి. వారి బంధం బయటపడకుండా చాలా జాగ్రత్తగా కొనసాగిస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అవి బయటపడుతుంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు హీరోయిన్ మృణాల్ ఠాకూర్, రాపర్ బాద్షా.. శిల్పా శెట్టి దీపావళి పార్టీకి జంటగా హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ పార్టీకి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వారిద్దరు శిల్పా దీపావళి పార్టీ నుంచి అర్థరాత్రి బయటకు వస్తుండగా.. ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని కనిపించారు. రెడ్డిట్‌లో వైరల్ అవుతున్న వీడియోలో మృణాల్ బాద్షాతో కలిసి పార్టీని విడిచిపెట్టడాన్ని చూడవచ్చు. ఒకరినొకరు చేతులు పట్టుకుని నడుస్తుండగా ఫోటో గ్రాఫర్లు తమ కెమెరాల్లో వారిని బంధించారు. ఇప్పుడు స్టార్స్ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. డేటింగ్ వార్తలు హెడ్‌లైన్స్‌లో ఉన్నాయి.
మృణాల్ ఆలివ్ గ్రీన్ ఎథ్నిక్ లెహంగాలో చాలా అందంగా ఉంది. న్యూడ్ మేకప్‌తో తన లుక్‌ను పూర్తి చేసింది. అయితే బాద్షా నల్లటి సంప్రదాయ దుస్తుల్లో చాలా అందంగా కనిపించాడు. ఇద్దరు తారల మధ్య శిల్పాశెట్టి కనిపిస్తుంది. ఆమె వైన్ వెల్వెట్ జంట దుస్తులలో కనిపిస్తుంది. మృణాల్, బాద్షాల ఈ వీడియోపై అభిమానులు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో బాద్షా తన ప్రేయసి ఇషా రిఖిని వివాహం చేసుకోబోతున్నాడని పుకార్లు వ్యాపించాయి. బాద్షా, రిఖీ గత ఏడాది కాలంగా డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. వారు ఒక పార్టీలో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారు తర్వాత ప్రేమలో పడ్డారు.