బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అలాంటి బ్యూటీకి లేక లేక ఒక్క ఆఫర్ వస్తే.. మరో బ్యూటీ మృణాల్ ఠాకూర్ పూజా కొంప ముంచినట్టుగా తెలుస్తోంది.
Mrinal Thakur: ఏ ముహూర్తాన ‘గుంటూరు కారం’ సినిమా నుంచి మధ్యలోనే డ్రాప్ అయిందో గానీ.. అప్పటి నుంచి పూజా హెగ్డే పరిస్థితి దారుణంగా మారింది. ఉన్న ఆఫర్లు పోవడమే కాదు.. వస్తున్న ఆఫర్లను కూడా మిగతా హీరోయిన్లు ఎగరేసుకుపోతున్నారు. గుంటూరు కారం తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను కూడా పూజా ప్లేస్‌ను శ్రీలీలతో భర్తీ చేశారు. అంతేకాదు.. రీసెంట్గా ఓ క్రేజీ ఆఫర్ కూడా మరో హీరోయిన్ ఎగరేసుకుపోయినట్టుగా తెలిసింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ముందుగా పూజా హెగ్డేని హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఆ ఆఫర్‌ను సప్త సాగరాలు దాటి చిత్రంలో నటించిన కన్నడ భామ రుక్మిణి వసంత్‌ను వరించిందని సమాచారం. ఇలా పూజాకు ఒక్కో ఆఫర్ చేజారిపోతునే ఉంది. కానీ లేట్‌గా వచ్చిన అప్డేట్ ప్రకారం.. సీతారామంలో హీరోయిన్ ఆఫర్‌ను కూడా మిస్ అయిందట పూజా హెగ్డే.
సీతారామం సినిమాతో స్టార్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయింది మృణాల్ ఠాకూర్. అక్కడి నుంచి ఎడాపెడా కాకుండా.. ఆచితూచి సినిమాలు చేస్తోంది అమ్మడు. ఇటీవలె హాయ్ నాన్న సినిమాతో మంచి హిట్ అందుకుంది. త్వరలోనే విజయ్ దేవర కొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంకొన్ని సినిమాల్లో కూడా మృణాల్ నటిస్తోంది. సీతారామం సినిమా మృణాల్‌కు మంచి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఇలాంటి సినిమాలో పూజా హెగ్డేకు ఛాన్స్ మిస్ అయిందట. ముందుగా సీతారామం సినిమాలో మృణాల్ ప్లేస్‌లో సీత క్యారెక్టర్ కోసం పూజా హెగ్డేను అనుకున్నారట మేకర్స్. కానీ పూజా ఈ పాత్రలో సెట్ అవుతుందా? లేదా? అనే డౌట్‌తో మృణాల్‌ను ఫైనల్ చేశారట. లేదంటే.. పూజాకు కెరీర్లో సాలిడ్ హిట్ పడి ఉండేది.