»Mohan Babu Response On Differences With Chiranjeevi
Mohan Babu: చిరంజీవితో విబేధాలపై మోహన్ బాబు ఏమన్నారంటే
చిరంజీవితో తనకు ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేసారు నటుడు మోహన్ బాబు. తాము వీలు కుదిరినప్పుడల్లా మాట్లాడుకుంటూనే ఉన్నామన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
చిరంజీవితో (Chiranjeevi) తనకు ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేసారు నటుడు మోహన్ బాబు (Mohan Babu). తాము వీలు కుదిరినప్పుడల్లా మాట్లాడుకుంటూనే ఉన్నామన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. చిరంజీవితో (Chiranjeevi) నెలకొన్న విభేదాలపై అడగగా… స్పందించారు. వజ్రోత్సవాల్లో జరిగిన వివాదంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఇలాంటి ఎన్నో వార్తలు వస్తాయని, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మేము సంతోషంగానే ఉన్నామని, కొన్ని సందర్భాలలో అన్నదమ్ములు, స్నేహితులు, ఆత్మీయుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వస్తుండటం చూస్తూనే ఉంటామన్నారు. అలాంటివి వచ్చి పోతుంటాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వాటి గురించి కాకుండా మరేదైనా ఆడగాలన్నారు.
అలాగే, మా ఎన్నికల సమయంలో చిరంజీవి, మోహన్ బాబులు లేదా వారి వర్గాల మధ్య ప్రతికూల వాతావరణం నెలకొన్న అంశంపై ప్రశ్నించగా… ఆ బాధ ఇప్పటికీ తన మనసులో ఉందని చెప్పారు కలెక్షన్ కింగ్. అలా ఎందుకు జరిగింది, ఇందులో తన తప్పు ఉందా… నా తప్పు ఉందా.. అనే అంశంపై చర్చించే ఉద్దేశ్యం లేదన్నారు. ఇప్పటికి తామిద్దరం వంద సార్లు ఎదురు పడ్డామని, మాట్లాడుకున్నామని, తమ మధ్య ఏమీ లేదన్నారు. బయటి వాళ్లు మాత్రమే మాట్లాడుకుంటున్నారని చెప్పారు. మా ఎన్నికల్లో గెలిచిన విష్ణు అన్ని పనులను చక్కబెడుతున్నారని, కేవలం బిల్డింగ్ నిర్మాణం మాత్రమే పెండింగ్ లో ఉందని చెప్పారు.