»Mission Raniganj Movie Starring Akshay Kumar In The Oscars
Mission Raniganj: ఆస్కార్ బరిలో అక్షయ్ కుమార్ మూవీ
ఆస్కార్ 2024కు భారత్ నుంచి కొన్ని చిత్రాలు పోటీపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రేసులో అక్షయ్ కుమార్ నటించిన చిత్రాన్ని మేకర్స్ ఇండిపెండెంట్ గా నామినేట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
Mission Raniganj movie starring Akshay Kumar in the Oscars
Mission Raniganj: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ మిషన్ రాణిగంజ్(Mission Raniganj). ది గ్రేట్ భారత్ రెస్క్యూ అనేది ట్యాగ్ లైన్. టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆస్కార్ బరిలోకి అడుగుపెట్టనుంది. వచ్చే ఏడాది ఆస్కార్ రేసులో పోటీ పడేందుకు జనరల్ కేటగిరిలో ఇండిపెండెంట్‌గా ఈ చిత్ర బృందం నామినేషన్ వేసింది. దీంతో ఈ చిత్రానికి నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న ఈ వార్తపై అక్షయ్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. గత ఏడాది ఆస్కార్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కూడా ఇలానే ఇండిపెండెంట్‌గా కొన్ని కేటగిరీల్లో నామినేషన్ వేసింది. ఆ తరువాత సొంతంగా ప్రచారం చేసుకుని ఒరిజనల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఈసారి ఆస్కార్ 2024 (Oscar 2024) అధికారిక ఎంట్రీ కోసం పలు భారతీయ చిత్రాలు పోటీ పడుతుండగా..జ్యూరీ మలయాళ మూవీ 2018ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
అక్టోబర్ 6న థియేటర్లో విడుదలై ఇంకా ప్రేక్షకులను అలరిస్తున్న మిషన్ రాణిగంజ్ చిత్రం ఓ బయోపిక్. ఇక స్టోరీ విషయానికి వస్తే రాణిగంజ్ కోల్‌ఫీల్డ్స్‌లో 65మంది మైనర్లను కాపాడిన జశ్వంత్ సింగ్ గిల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అక్షయ్ కుమార్ ప్రాధాన పాత్రలో నటించిగా ఈ చిత్రంలో ఆయనకు జోడిగా పరిణీతి చోప్రా నటించారు. విమర్షకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ కమర్షల్‌గా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అలాగే వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తెరకెక్కించిన ది వ్యాక్సిన్ వార్ (The Vaccine War)స్క్రిప్ట్ ఆస్కార్ లైబ్రరీలో శాశ్వతంగా చోటు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఎక్స్‌లో పంచుకున్నారు. దీనిపై కూడా నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.