»Megastar Chiranjeevi Starrer Bhola Shankar Movie Review
Bholashankar Movie Review: భోళాశంకర్ మూవీ రివ్య్యూ
మెహార్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ చిత్రం ఆగస్ట్11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీర్తి సురేష్, తమన్నా, సుశాంత్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
Megastar Chiranjeevi Starrer Bhola Shankar Movie Review
చిత్రం : భోళా శంకర్ నటీనటులు : చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేష్, వెన్నెల కిషోర్, పి.రవి శంకర్, తులసి శివమణి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, గెటేప్ శీను, లోబో తదితరులు డైరెక్టర్ : మెహర్ రమేష్ నిర్మాత : రామబ్రహ్మం సుంకర సినిమాటోగ్రఫీ : డుడ్లీ సంగీతం : మహాతి స్వర సాగర్ విడుదల : 11-08-2023
Bholashankar Movie Review: చిరంజీవి(Chiranjeevi) హీరోగా తమన్నా(Tamannah) హీరోయిన్ గా మెహర్ రమేష్(Mehar Ramesh) దర్శకత్వంతో తెరకెక్కిన భోళాశంకర్(Bholashankar) చిత్రం తమిళ్ హీరో అజిత్ నటించిన వేదాళం రీమేక్ అన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ వీరాభిమాని అయిన మెహర్ రమేష్ చాలా గ్యాప్ తరువాత మెగాఫోన్ పట్టి పరిశ్రమలో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నారు. అలాగే వాల్తేరు వీరయ్య సినిమా హిట్ తరువాత చిరంజీవి అదే జోరులో దూసుకుపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు(Bholashankar Movie Review). మరీ వీరు జోరు ప్రేక్షకులకు ఎంతలా మెచ్చిందో తెలియాలంటే ముందు భోళా శంకర్ రివ్వ్యూ చూడాల్సిందే.
కథ:
మహిళల అక్రమ రవాణాతో సినిమా ప్రారంభమౌతుంది. శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహా (కీర్తి సురేష్) చదువు కోసం కోల్‌కతాకు వస్తాడు. ఆమెను కాలేజీలో చేర్పించి జీవనోపాధి కోసం శంకర్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తాడు(Bholashankar Movie Review). మహిళల అక్రమ రవాణా నేరాల్లో కలకత్తా పోలీసులు టాక్సీ డ్రైవర్ల సహాయాన్ని కోరడంతో..వారికి శంకర్ ఒక కీలకమైన క్లూ ఇస్తాడు. అది అతనిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. మరోపక్క లాస్య(తమన్నా) సోదరుడు శ్రీఖర్ (సుశాంత్) మహా (కీర్తి)ని ప్రేమిస్తాడు. వీరి పెళ్లికి శంకర్ కూడా ఆమోదించాడు. అయితే లాస్యకు శంకర్ గతం గురించి తెలుస్తుంది. అతను చాలా హత్యలు చేశాడని మహాతో తన సోదరుడి వివాహాన్ని ఆపాలని నిర్ణయించుకుంటారు(Bholashankar Movie Review). ఆ క్రమంలో శంకర్ తన గతాన్ని, కోల్‌కతాకు రావడం వెనుక తన ఉద్దేశ్యాన్ని వివరిస్తాడు. మహిళల అక్రమ రవాణా చేస్తున్న క్రైమ్ నెట్వర్క్ కు శంకర్‌కు సంబంధం ఏంటి? వారిని ఎలా అంతమొందిస్తాడు? అతని ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది:
కంప్లీట్ చిరంజీవి ఫ్యాన్స్ సినిమా అని చెప్పవచ్చు. భోళా శంకర్ మెగాస్టార్ చిరంజీవి మైయిన్ పిల్లర్. ఈ వయసులో ఇలాంటి డ్యాన్స్ మూమెంట్స్ చేయడం అది చిరంజీవికే చెల్లుద్ది(Bholashankar Movie Review). ఇంటర్వెల్ తర్వాత వచ్చే కామెడీ సీక్వెన్స్‌లో చిరు మరో సారి తన మార్క్‌ను చూపించారు. ఇక ఖుషి నడుము సీన్‌ని చిరు తన మ్యానరిజమ్స్‌తో అద్భుతంగా చేశారు. అలాగే పవన్ మేనరిజమ్స్ కూడా బాగున్నాయి(Bholashankar Movie Review). చిత్రం ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత కథ సిరీయస్‌గా వెళ్తుంది. విజువల్‌గా సినిమా రిచ్‌గా కనిపిస్తోంది. సినిమాలో మెయిన్ థీమ్ అయిన సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగా కుదిరింది(Bholashankar Movie Review). సదరు ఆడియన్ను కట్టిపడేస్తుంది. ఇక విలన్ సీన్లు ఉత్కంఠభరితంగా ఉన్నా క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోదని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ సినిమా ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారు:
భోళా శంకర్ సినిమా చిరంజీవి సినిమా(Bholashankar Movie Review). ఆయన అభిమానులకు కన్నుల పండుగలాంటి చిత్రం. ఆయన డ్యాన్సులు, ఆయన లుక్స్, మేనరిజమ్స్‌తో సినిమా మొత్తం ఆకట్టుకుంటారు. ఇక చిరంజీవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంటుంది. ఆయనే అన్న. ఇక సోదరి పాత్రలో కీర్తి సురేష్ పర్వాలేదు, ఆమెకు నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. తమన్నా తెరపై బబ్లీగా కనిపించింది. తన పాత్రకూడా పరిమితమే. ఇక డ్యాన్స్‌లతో రెచ్చిపోయింది(Bholashankar Movie Review). వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, శ్రీముఖి సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోలేదనిపిస్తుంది. సినిమాలో విలన్లకు కూడా పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. చిరంజీవికి తప్ప సినిమాలో పెద్దగా ఎవరికీ క్యారెక్టర్ లెంత్ ఇవ్వలేదనిపిస్తుంది.
గత సినిమాలతో పోలిస్తే దర్శకుడు మెహార్ రమేష్ ఇందులో తన పనితనాన్ని చూపించారు. కాకపోతే కొన్ని సీన్లను కూడా మార్చితే బాగుండేది(Bholashankar Movie Review). ఓరల్ గా తనకున్న ఎక్స్పిరియన్స్తో సినిమాని అనుకున్న ఎమోషన్లో డ్రైవ్ చేయగలిగాడు. సినిమాలో రెండు పాటలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మహతి స్వర సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నిరాశపరిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి(Bholashankar Movie Review). స్టైలిష్ డైరెక్టర్‌గా పేరున్న మెహర్ రమేష్ తనకు ఇష్టమైన హీరోను స్టైల్‌గా చూపించడంలో విఫలం అయ్యాడని అనిపిస్తుంది. సినిమా సెకండ్ బాగుంది.