మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5న విడుదలకు సిద్దమవుతోంది. దాంతో ప్రమోషన్స్ పీక్స్‌లో చేస్తున్నారు మెగాస్టార్. ఇటీవల ఈ సినిమా టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో గాడ్ ఫాదర్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు మెగాభిమానులు. అయితే ఈ లోపు మాసివ్ ఈవెంట్‌తో మెగా ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్. సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో.. అంతకంటే ముందే గాడ్ ఫాదర్ ఈవెంట్‌తో మెగా రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడా సమయం రానే వచ్చేసింది. అనంతపురంలో భారీ ఎత్తున జరగనున్న గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సర్వం సిద్దమైంది.
ఈ ఈవెంట్ కోసం మెగాభిమానులు భారీ ఎత్తున తరలి రానున్నారు. ఇప్పటికే భారీ ర్యాలీలతో అనంతపురం బాట పట్టారు మెగాభిమానులు. అలాగే మాస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇక ఈ మాసివ్ ఈవెంట్లో గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. దాంతో గాడ్ ఫాదర్ ఈవెంట్లో ఫ్యాన్స్ మరింత రచ్చ చేయడం ఖాయం. అలాగే గాడ్ ఫాదర్ ట్రైలర్ సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేయనుందని చెప్పొచ్చు. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మెగా మూవీలో నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాధ్.. కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.