Megastar chiranjeevi: సోషల్ మీడియాలో మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
సీనియర్ రైటర్‌గా టాలీవుడ్లో ఎంతో పేరు సంపాదించుకుని వసంతాలు పూర్తి చేసుకున్న వ్యక్తి సత్యానంద్. ఈ సందర్భంగా మెగాస్టార్ చీరంజీవి సోషల్‌మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
రైటర్ సత్యానంద్.. ఈ పేరుకి టాలీవుడ్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సూపర్‌స్టార్ క్రిష్ణ నటించిన ‘మాయదారి మల్లిగాడు’ సినిమాతో సినీ ఇండ్రస్టీకి రచయితగా పరిచయం అయ్యాడు సత్యానంద్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది అగ్రకథానాయకుల సినిమాలకు రచయితగా వ్యవహరించి సీనియర్ రైటర్‌గా పేరు సంపాదించుకున్నాడు. అయితే సత్యానంద్ సినీ ఇండ్రస్టీలోకి వచ్చి 50 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చీరంజీవి సత్యానంద్‌ను అభినందిస్తూ.. సోషల్‌మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘బ్లాక్‌బ్లస్టర్ సినిమాలకు స్క్రిప్ట్ అందించి.. ఎన్నో మరపురాని డైలాగ్స్‌ని రాసి.. ప్రస్తుత రచయితలకు ఒక రోల్ మోడల్‌గా నిలిచిన మీకు నా హృదయ పూర్వక శుభాకాంక్షాలు’ అని మెగాస్టార్ భావోద్వేగమైన పోస్ట్ చేశారు.
కష్టంతో కాకుండా సినిమా మీద ఉన్న ఇష్టంతో సినిమాలు చేస్తూ సీనియర్ రైటర్‌గా ఎదిగిన వ్యక్తి సత్యానంద్. ఈయన కేవలం నా సినిమాలకు రచయిత మాత్రమే కాదు. నాకు ఆప్తుడు కూడా. నా సినీ ప్రస్థానంలో సత్యానంద్ పాత్ర కూడా ఎంతో ఉందని చీరంజీవి అన్నారు. సూపర్ స్టార్ క్రిష్ణ, ఎన్టీఆర్, ఏఎన్నార్, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి అగ్రనాయకులతో వర్క్ చేశారు. దాదాపు 400 సినిమాలకు పైగా రైటర్‌గా వ్యవహరించారు. ఇలా ఇంకా ఎన్నో సినిమాలకు రచయితగా వ్యవహరిస్తూ.. మరో 50ఏళ్లు పూర్తిచేసుకోవాలని కోరుకుంటున్నానని చీరంజీవి తెలిపారు.
ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి
స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, మరెన్నో చిత్రాలకు స్క్రిప్ట్ డాక్టర్ గా వుంటూ , ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటోర్ గా,ఒక గైడింగ్ ఫోర్స్ గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్ గా వుంటూ , సినిమాని ప్రేమిస్తూ , సినిమానే… pic.twitter.com/Tc7aphFOD2