»Mega Daughter Niharikas Instagram Post Goes Viral
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్…
మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారిక, (Neharika) జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలుసు . అయితే రీసెంట్గా వీళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్ లో ఒకరినిఒకరు అన్ ఫాలో చేసుకున్నారు . అంతేకాదు జొన్నలగడ్డ చైతన్య (Caitanya jonnalagadda) – నిహారికతో జరిగిన పెళ్లి ఫొటోస్ ని ఏకంగా డిలీట్ చేసేసారు . ఈ క్రమంలోనే త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే .ప్రముఖ నిర్మాత నాగబాబు (Naga Babu) కూతురు మెగా డాటర్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ (Caitanya jonnalagadda) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే నిహారిక ఉన్న ఇన్స్టాగ్రామ్ (Instagram) పోస్టులను చైతన్య తన అకౌంట్ నుంచి డిలీట్ చేయగా, ఇప్పుడు నిహారిక కూడా వారిద్దరు కలిసి దిగిన ఫోటోలన్నింటినీ రీమో చేసింది. అంతే కాదు సోషల్ మీడియా వేదిక పై వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో (unfollow) కూడా అయ్యారు. వీరిద్దరి వైవాహిక బంధంలో సమస్య వచ్చిందని, పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకునే దశలో ఉన్నారని, కొన్ని నెలలుగా వారు విడివిడిగా ఉంటున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.అయితే, ఇవ్వాల ఇన్స్టాగ్రామ్ లో నిహారిక పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
ప్రముఖ ఫొటో గ్రాఫర్ అరిఫ్(Photographer Arif) పుట్టిన రోజు సందర్భంగా ఇన్స్టా స్టోరీలో అతడితో దిగిన పిక్స్ షేర్ చేసుకుంది. ‘‘యూ ఆర్ వెరీ స్పెషల్’(You are very special)’ అంటూ చెప్పింది నిహారిక.అయితే ఇప్పటివరకు దీనిపై మెగా ఫ్యామిలీ(Mega Family) కానీ జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ కానీ ఏ విధంగా స్పందించలేదు. అయితే జొన్నలగడ్డ చైతన్య మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటే .. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటూ తయారయింది. సోషల్ మీడియాలో విడాకులు అంటూ వస్తున్న వార్తలను ఏమాత్రం లెక్క చేయకుండా తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . బ్యాక్ టు బ్యాక్ మంచి ప్రాజెక్టు లు పట్టేస్తున్న నిహారిక.. రీసెంట్ గా రెట్రో లుక్ (Retro look) క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది .ఈ ఫొటోస్ లో నిహారిక చూడడానికి చాలా ముద్దుగా ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటే .. మరి కొందరు ఇలాంటి వాటి కోసమేనా మొగుడికి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నావు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . అయితే మెగా డాటర్ నిహారిక(Mega daughter Neharika) ఏ మాత్రం పట్టించుకోకుండా తనదైన స్టైల్ లో ముందుకు పోతుంది