NRPT: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని ఎస్పీ వినీత్ తెలిపారు. ప్రజలు నేరుగా ఫోన్ ద్వారా ఫిర్యాదులు, సలహాలు అందించారని చెప్పారు. మొత్తం 17 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో ఎక్కువగా భూ తగాదాలు, రాత్రి పెట్రోలింగ్, ట్రాఫిక్ సమస్యలు, గంజాయి నిర్మూలనకు సంబంధించినవి ఉన్నట్లు ఆయన వివరించారు.