ATP: అనంతపురంలోని కూరగాయల మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటాయి. దాదాపు అన్ని కూరగాయలు కిలో రూ.100కు చేరడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతినడం, పొలాల్లో నీరు నిలవడంతో దిగుబడి తగ్గింది. స్థానికంగా సరఫరా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, అందుకే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.