కార్తీకమాసంలో గంగా, గోదావరి, కావేరీ, తుంగభద్ర నదులలో స్నానం చేస్తే అత్యంత పవిత్రం. నదీ స్నానానికి ఆవకాశం లేకపోతే కాలువలో, చెరువులో సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. తర్వాత మడిబట్టలను ధరించి ముందుగా భగవంతుని స్మరించుకోవాలి. తర్వాత భస్మాన్ని నుదుట ధరించి సంధ్యావందనం, దేవతార్చన చేసుకోవాలి. స్నానతీర్థములోనే కార్తీక పురాణ శ్రవణమును పఠించాలి.