CTR: రొంపిచెర్ల మండలంలోని బొమ్మయ్య గారిపల్లిలో కోడిపందేలు ఆడుతున్న ముగ్గురుని అదుపులోకి తీసుకొన్నట్లు ఎస్సై సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వారి నుంచి రూ.2100 నగదు, 2 కోళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్టోన్ క్రషర్ వద్ద ఉన్న మామిడి తోటలో కోడిపందేలు ఆడుతున్నారని రహస్య సమాచారం రావడంతో ఈ మేరకు దాడి చేశామని పేర్కొన్నారు.