manoj share mounika photo..కాబోయే భార్య పిక్ షేర్ చేసిన మంచు మనోజ్
manoj share mounika photo:మంచు మనోజ్ (manchu manoj) భూమా మౌనిక (bhuma mounika) ఈ రోజు రాత్రి వివాహ బంధంలోకి అడుగిడనున్నారు. మనోజ్ సిస్టర్ మంచు లక్ష్మీ (manchu laxmi) ఇంట్లో.. అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరగనుంది. సుముహుర్తం రాత్రి 8.30 గంటలకు ఉంది. తనకు కాబోయే భార్య (wife) ఫోటోను మంచు మనోజ్ (manchu manoj) సోషల్ మీడియాలో షేర్ చేశారు.
manoj share mounika photo:మంచు మనోజ్ (manchu manoj) భూమా మౌనిక (bhuma mounika) ఈ రోజు రాత్రి వివాహ బంధంలోకి అడుగిడనున్నారు. మనోజ్ సిస్టర్ మంచు లక్ష్మీ (manchu laxmi) ఇంట్లో.. అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరగనుంది. సుముహుర్తం రాత్రి 8.30 గంటలకు ఉంది. అయితే తనకు కాబోయే భార్య (wife) ఫోటోను మంచు మనోజ్ (manchu manoj) సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫోటో ట్వీట్ చేయగా.. లైకులు, షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
మంచు మనోజ్ (manoj) నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు ఇదివరకే ప్రణతీరెడ్డితో (pranathi reddy) పెళ్లి అయ్యింది. మనస్పర్థలు రావడంతో ఇద్దరు పరస్పర అంగీకారంతో 2019లో విడిపోయారు. ఆ తర్వాత చాలా రోజులు సినిమాలకు కూడా మంచు మనోజ్ (manoj) దూరంగా ఉన్నారు. మనోజ్‌కు (manoj) మౌనిక (mounika) మంచి స్నేహితురాలు. ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకొని.. ఒక్కటి కాబోతున్నారు.
మౌనిక.. భూమా నాగిరెడ్డి (bhuma nagireddy)- శోభా నాగిరెడ్డిల (shobha nagireddy) రెండో కూతురు. ఆమెకు కూడా ఇదివరకే పెళ్లి అయ్యింది. విడిపోయి ఒంటరిగానే ఉంటున్నారు. ఇప్పుడు మనోజ్‌ను మనువాడబోతున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో చాలాసార్లు వీరిద్దరి కలిసి కనిపించారు. ఆలయాలకు వెళ్లారు. ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ కెమెరాలకు చిక్కారు. గతంలో వీరిద్దరికి రహాస్యంగా పెళ్లయ్యిందనే వార్తలు కూడా వినిపించాయి. అవి పుకార్లేనని తేలిపోయాయి. తమ ప్రేమ బంధాన్ని వివాహంతో అధికారికంగా జంటగా కాబోతున్నారు.