Malaika Arora: సెమీ న్యూడ్ ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చిన ముదురు బ్యూటీ!
బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లకు.. ఒకరితో కొన్నాళ్లు షికారు చేసి.. ఇంకొన్నాళ్లు ఇంకొకరితో తిరిగి.. ఆ తర్వాత వేరొకరిని పట్టుకోవడం.. బ్రేకప్‌ల మీద బ్రేకప్ చెప్పడం.. బాగా అలవాటైన పనే. ఈ విషయంలో బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా ఖాన్ ఎప్పటి కప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన పనికి నెటిజన్స్ ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు.
మలైకా అరోరా ఖాన్(Malaika Arora).. సల్మాన్ ఖాన్(Salman Khan) బ్రదర్ అర్బజ్ ఖాన్‌కు విడాకులు ఇచ్చి.. ప్రస్తుతం తనకంటే వయసులో పదేళ్లకు పైగా చిన్నవాడైన హీరోతో డేటింగ్ చేస్తోంది. ఈ విషయంలోనే మలైకా ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. ఎక్కడికెళ్లినా ఈ లేత, ముదురు జంట కలిసే వెళ్తుంటారు. ఇక ఆ ఇద్దరు రొమాన్స్ చేస్తు ఇచ్చే రకరకాల ఫోజులు మామూలుగా ఉండవు. అంతటితో ఆగకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
తాజాగా ఏకంగా బెడ్రూం ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చింది. అయితే ఆ ఫోటో ఆమెది కాదులేండి.. ఆమె బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్(Arjun kapoor)ది. నా లేజీ బాయ్.. అంటూ అర్జున్ కపూర్ ఒంటి మీద ఏమీ లేకుండా బెడ్ మీద ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటో మధ్యలో పిల్లో లేకపోతే ఇక అంతే సంగతులు. ఇక ఈ ఫోటో చూసిన తర్వాత నెటిజన్స్ ఓ రేంజ్లో మండిపడుతున్నారు. డేటింగ్ చేసుకుంటే చేసుకోండి.. కానీ ఈ వయసులో ఇలా ప్రవర్తిస్తే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్నా నీ కొడుకు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించవా అంటు ఫైర్ అవుతున్నారు. అసలు ఈ వయసులో ఇలాంటి పోస్టు చేయాల్సిన అవసరం ఉందా? నీ బెడ్రూం విషయాలు పోస్టు చేయాల్సిన పనేంటి? అంటూ ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. అన్నట్టు ఈ ముద్దుగుమ్మ తెలుగు ఆడియెన్స్‌కు గబ్బర్ సింగ్‌లోని ఐటెం సాంగ్‌తో బాగా పరిచయం అయింది. కెవ్వుకేక పాటలో అమ్మడు పవర్ స్టార్‌తో కలిసి చిందులేసింది.