Leo Movie: బర్త్ డే గిఫ్ట్..లియో నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
దళపతి విజయ్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా లియో. తాజాగా విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
దళపతి విజయ్(Vijay) బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న లియో (Leo.. Bloody Sweet) మూవీ నుంచి మేకర్స్ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీకి లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ జన్మదినం సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఫస్ట్ లుక్‌లో విజయ్ సుత్తి పట్టుకొని యాక్షన్ మూడ్‌లో ఉన్న స్టిల్ అందరికీ గూస్బంప్స్ తెప్పిస్తోంది.
— Seven Screen Studio (@7screenstudio) June 22, 2023
లియో మూవీ(Leo) నుంచి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ అయిన ‘నా రెడీ సాంగ్’ ప్రోమో (Naa Ready Song)ను మేకర్స్ రిలీజ్ చేయగా తాజాగా దానికి సంబంధించిన పూర్తి లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ ను విష్ణు ఎడవన్ రాశారు. విడుదలైన సాంగ్ ను దళపతి విజయ్, అనిరుధ్ రవిచందర్ కలిసి పాడారు. లియో మూవీలో త్రిష కథానాయికగా కనిపిస్తోంది. మేకర్స్ నుంచి విడుదలైన లియో టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియో మూవీపై భారీగా అంచనాలను పెంచుతోంది.
లియో మూవీ(Leo) నుంచి ‘నా రెడీ సాంగ్’ :
ఈ మూవీలో బాలీవుడ్(Bollywood) యాక్టర్ సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ, తదితరులు నటించారు. యాక్షన్ జోనర్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. అక్టోబర్ 19వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది.