Lokesh Kanagaraj: షాకింగ్ డెసిషన్..6 నెలలు బ్రేక్!
కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఆరు నెలలు బ్రేక్ ఇస్తున్నట్టుగా ప్రకటించాడు. మరి లోకేష్ బ్రేక్ ఎందుకు? నెక్స్ట్ సినిమా పరిస్థితేంటి? అసలు దేనికి బ్రేక్ ఇవ్వనున్నాడు?
మాస్టర్ సినిమాతో దళపతి విజయ్‌కు ఫ్లాప్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj).. లియోతో అదిరిపోయే హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే.. మాస్టర్లా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్‌గా కాకుండా.. ఎల్సీయూలో భాగంగా లియోని తెరకెక్కించాడు. కానీ దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయిన లియో సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ రిజల్ట్ అందుకుంది. అయినా కూడా భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు రూ.540 కోట్లు రాబట్టినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక లియో సినిమా తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తలైవార్ 171(thalaivar 171) ప్రాజెక్ట్ చేయనున్నాడు లోకేష్. ఇప్పటికే అధికారింగా ప్రకటించారు.
ప్రస్తుతం జై భీం ఫేం దర్శకుడు జ్ఞానవేల్‌తో 170 ప్రాజెక్ట్ చేస్తున్న రజనీ.. ఆ తర్వాత లోకేష్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే లియో ప్రమోషన్స్‌లో భాగంగా..రజనీ ప్రాజెక్ట్ పై లోకేష్ కనగరాజ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రజనీలోని నెగెటివ్ షేడ్స్‌ను మరోసారి చూపించబోతున్నానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. రజనీకాంత్ సినిమా కోసం ఆరు నెలల పాటు సోషల్ మీడియా(social media)కు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం రజనీకాంత్ సినిమాపైనే దృష్టి పెట్టబోతున్నా. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టామని అన్నారు. అంటే.. లోకేష్ బ్రేక్ ఇస్తానని చెప్పింది సోషల్ మీడియాకు మాత్రమే. సినిమాలకు కాదు. సూపర్ స్టార్‌తో కలిసి సాలిడ్ హిట్ కొట్టడానికి పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేయడానికి ఆరు నెలలు సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నాడు లోకేష్.