బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గానే ఉన్నాడు. 57 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇంకా సింగిల్‌గానే ఉన్నాడు. అప్పుడప్పుడూ మాజీ ప్రియురాళ్లను తలచుకునే సల్మాన్ వారి ప్రేమ విషయంలో తప్పంతా తనదేనని ఒప్పుకున్నాడు. తాజాగా సల్మాన్ కు ఓ పెళ్లి ప్రపోజల్ వచ్చింది. అయితే తను మాత్రం పెళ్లి చేసుకునే వయసు దాటిపోయిందంటూ చెప్పుకొచ్చాడు.
వైరల్ అవుతున్న సల్మాన్ ఖాన్ వీడియో:
Reporter: I came all the way from Hollywood, just to ask you a question. 'Salman- are you talking bout the Gobar star #ShahRukhKhan? 'Reporer: Nooo, it's you #SalmanKhan Plz would you marry me!! Jalwa 😂🔥
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(IIFA) అవార్డు వేడుకల్లో చాలా మంది బాలీవుడ్ తారలు(Bollywood celebrities) మెరిశారు. దుబాయ్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ కు సల్మాన్(Salman Khan) కూడా వెళ్లాడు. ఈ సందర్భంగా మీడియాతో సల్మాన్ ఖాన్ మాట్లాడుతున్నప్పుడు ఓ లేడీ రిపోర్టర్ ఆయన్ని ప్రపోజ్ చేసింది. సల్మాన్‌ను చూసినప్పుడే తాను ప్రేమలో పడిపోయినట్లు తెలిపింది. అప్పుడు సల్మాన్ చమత్కారంగా మాట్లాడుతూ..మీరు షారుక్ గురించి మాట్లాడుతున్నారు కదా అని అన్నారు. దీంతో అక్కడ నవ్వులు పూచాయి.
రిపోర్టర్ తిరిగి మాట్లాడుతూ..లేదు సార్, నేను మీ గురించే మాట్లాడుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. దీంతో సల్మాన్(Salman Khan) నిరాశతో మొహం పెట్టి తనకు పెళ్లి వయసు దాటిపోయిందని తెలిపాడు. 20 ఏళ్ల క్రితం కలిసి ఉంటే బావుండేదని సరదాగా సల్మాన్ మాట్లాడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.