Keerthy Suresh నిజంగానే బంగారం.. గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్!
Keerthy Suresh : ఒక్క మాటలో చెప్పాలంటే.. దసరా సినిమా ఓ హిస్టరీయే అంటున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇంకో పది రోజుల్లో థియేటర్లో అసలైన దసరా మొదలు కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే.. దసరా సినిమా ఓ హిస్టరీయే అంటున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇంకో పది రోజుల్లో థియేటర్లో అసలైన దసరా మొదలు కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో వెన్నెలగా ఊరమాస్ లుక్లోనటించింది కీర్తి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సాంగ్స్‌లో కీర్తి చించేసినట్టు కనిపిస్తోంది. కీర్తి కూడా మహానటి తర్వాత.. వెన్నెల పాత్రకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యానని.. ఖచ్చితంగా ఈ సినిమా తనకు మంచి విజయాన్ని అందిస్తుందనే నమ్మకంతో ఉంది. దసరా కంటెంట్ కూడా అలాగే కనిపిస్తోంది.. కాబట్టి దసరా హిట్టే.. కానీ ఏ రేంజ్ హిట్ అనే దానికోసమే చిత్ర యూనిట్ వెయిట్ చేస్తున్నట్టుంది. అందుకే.. ముందుగానే ఈ సినిమా కోసం పని చేసిన వారికి.. కీర్తి సురేష్ ఏకంగా గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్‌గా ఇచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 130 మందికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చిందట. అంతలా వెన్నెల పాత్ర కీర్తికి సంతృప్తినిచ్చిందట. అందుకే ‘మహానటి’ తర్వాత తన గురించి గొప్పగా చెప్పుకునే సినిమా ఇదేనని బల్లగుద్ది మరి చెబుతోంది. దీంతో చిత్ర యూనిట్ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోను మా కీర్తి పాప నింజగానే బంగారం అంటున్నారు. ఇప్పటి వరకు మహానటిగానే ఉన్న కీర్తిని.. మార్చి 30 తర్వాత వెన్నెలగా మార్చబోతోంది దసరా. ఏదేమైనా కీర్తి బంగారు కానుకలు ఇవ్వడం చూస్తుంటే.. దసరా పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.