Congress MLA Enter To House: బిగ్ బాస్ రియాలిటీ షోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. విదేశాల్లో జరిగిన షో క్రమ క్రమంగా ఇండియాకు పాకింది. హిందీలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సీజన్లు పూర్తయిపోయాయి. ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లో అక్కడి సెలబ్రిటీ స్టార్స్ షో చేస్తున్నారు. అక్కడ జనం కూడా షోను చూస్తున్నారు. నెగిటివ్ ప్రచారం చేస్తున్నప్పటికీ.. షో రేటింగ్ మాత్రం తగ్గడం లేదు.
బిగ్ బాస్ షోకు సెలబ్రిటీలు వస్తుంటారు. సీరియల్ యాక్టర్స్, నటులు, మీడియా నుంచి యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్, బ్లాగర్స్ ఇలా పలువురు వస్తుంటారు. హౌస్‌లో ఆటలాడి, నవ్విస్తూ.. ఆడిస్తూ, అలరిస్తూ ఉంటే.. ప్రేక్షకులు ఓటు వేస్తారు. అయితే కన్నడ బిగ్ బాస్‌లో ఓ ప్రజా ప్రతినిధి ప్రత్యక్షం అయ్యాడు. ఓ ఎమ్మెల్యే (Congress MLA) హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆశ్చర్య పరిచారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) ప్రదీప్ ఈశ్వర్ (Pradeep Eshwar) హౌస్‌లోకి వచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇదేంటి ఎమ్మెల్యే ఇలా రావడం ఏంటీ అని తెగ చర్చ జరుగుతోంది. ప్రజా సమస్యలను తీర్చమని ఎమ్మెల్యేను చేస్తే.. ఇలా హౌస్‌లోకి వెళ్లడం ఏంటీ అనే విమర్శలు వస్తున్నాయి. జనంతో నేతలు ఉండాలి కానీ.. రియాలిటీ షోలలో కాదని బీజేపీ అంటోంది. ఏదీ ఏమైనప్పటికీ ఓ ఎమ్మెల్యే బిగ్ బాస్ హౌస్‌లోకి రావడంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అదేం కాదని.. నేతలు రియాలిటీ షోలలో పాల్గొంటే తప్పేం లేదని కొందరు కాంగ్రెస్ నేతలు సమర్థించుకుంటున్నారు. ఈ అంశం కాంగ్రెస్- బీజేపీ నేతల మధ్య వాదనకు దారితీసింది.