టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్ కుటుంబసమేతంగా ఉడుపి శ్రీ కృష్ణ మఠంను సందర్శించి శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు పొందారు. ఉడుపి ఆలయ దర్శనంకు సంబంధించి కొన్ని ఫోటోలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ పర్యటన గురించి ఆయన సోషల్ మీడియా లో చెప్తూ “నా తల్లి సొంతవూరు అయిన కుందపురా కు నన్ను తీసుకెళ్లి, ఉడుపి శ్రీ కృష్ణ దర్శనం చేయించడం ఇప్పుడు నిజమైంది! ఆమె పుట్టిన రోజు సెప్టెంబర్ 2కు ముందు ఇది జరగడం ఆమెకు ఇచ్చే అత్యంత ప్రత్యేకమైన గిఫ్ట్ ” అని ఎన్టీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత, KGF, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్ కు కన్నడ సీమలో మంచి ఫాలోయింగ్ ఉంది, తమ హీరోలతో ఎన్టీఆర్ ను చూడటంతో కన్నడ సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కన్నడ మీడియాతో కాసేపు ముచ్చటించారు