Allu Arjun : ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్లో రిలీజ్ చేసే ప్లానింగ్‌లో ఉన్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు బన్నీ.
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్లో రిలీజ్ చేసే ప్లానింగ్‌లో ఉన్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు బన్నీ. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కమిట్ అయ్యాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ప్రభాస్ 25వ చిత్రం ‘స్పిరిట్’ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఆ తర్వాతే అల్లు అర్జున్ సినిమా ఉంటుంది. 2025లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఈ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థలపై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించనున్నారు. అయితే.. సందీప్ రెడ్డి వంగా ప్రొడక్షన్ హౌస్ పేరు భద్రకాళి పిక్చర్స్.. ఈ క్రమంలో తన నిర్మాణ సంస్థ పేరునే ఈ సినిమాకు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని.. ‘భద్రకాళి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ సందీప్ రెడ్డి ఈ టైటిల్‌ను ఫిక్స్ చేస్తే.. అనౌన్స్మెంట్ చేసేవారు. ఎందుకంటే.. ప్రభాస్ ‘స్పిరిట్’ విషయంలో ముందే టైటిల్ ప్రకటించాడు. కాబట్టి ఇప్పుడే బన్నీ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయిందంటే.. నమ్మలేం. కానీ ‘భద్రకాళి’ టైటిల్ మాత్రం అదిరిపోయిందనే టాక్ నడుస్తోంది. మరి ఈ ‘రా’ కాంబో ఎలాంటి టైటిల్‌తో వస్తారో చూడాలి.