»International Emmys 2023 Vir Das Wins The Prize For Comedy
Emmy అవార్డు గెలిచిన ఇండియన్ యాక్టర్, ఏ విభాగంలో అంటే..?
ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డును కమెడీయన్ వీర్ దాస్‌కు వరించింది. నెట్ ఫ్లిక్స్‌లో వచ్చే వీర్ దాస్- ల్యాండింగ్ షోలో అతనికి టైమింగ్ కామెడీకి అవార్డు వచ్చింది.
International Emmys 2023: Vir Das Wins The Prize For Comedy
Emmy Award: ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డును (Emmy Award) భారతీయ నటుడు గెలుచుకున్నాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో వస్తోన్న వీర్ దాస్- ల్యాండింగ్ చేసిన నటుడు వీర్ దాస్‌కు కామెడీ విభాగంలో అవార్డు వరించింది. యూకేకు చెందిన డెర్నీ గర్ల్స్ సీజన్ 3తో కలిసి అవార్డును జ్యూరీ సభ్యులు ప్రకటించారు. ఇదే వీర్ దాస్ (Vir Das) కామెడీ సీజన్‌కు సంబంధించి గతంలో కూడా వీర్ దాస్ నామినేషన్ పంపించారు. అప్పుడు జ్యురీ సభ్యులను మెప్పించలేదు..ఈ సారి మాత్రం అవార్డు వరించింది.
ఖుషీ
ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో వీర్ దాస్ (Vir Das) ఆనంద డోలికల్లో మునిగి తేలారు. ఇప్పటికీ నమ్మ లేకపోతున్నానని, ఇప్పటికీ కలలా అనిపిస్తోందని పేర్కొన్నారు. ఇది తన ఒక్కడికే మైలు రాయి మాత్రమే కాదు.. భారతీయ కామెడీ నటీనటులు అందరికీ వర్తిస్తోందని చెప్పారు. వీర్ దాస్‌లో నటించే అవకాశం ఇచ్చిన నెట్ ఫ్లిక్స్, ఆకాశ్ శర్మ, టైగర్ మ్యాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన జర్నీ చిన్నగా మొదలై.. ఇప్పుడు ఎమ్మీ అవార్డు గెలిచే వరకు వచ్చిందని వివరించారు. తన ఎదుగుదలలో నెట్ ఫ్లిక్స్ కీలకపాత్ర పోషించిందని తెలిపారు.
టైమింగ్ కామెడీ
విభిన్నంగా ఆలోచించే వీర్ దాస్.. నటన, టైమింగ్ కామెడీతో నోయిడా నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగానని పేర్కొన్నారు. వీర్ దాస్తోపాటు మరో నలుగురు భారతీయులు కూడా ఎమ్మీ అవార్డు కోసం నామినేట్ చేయబడ్డారు. ఢిల్లీ క్రైమ్ నుంచి షెఫాలీ షా ఉత్తమ నటిగా నామినేట్ చేశారు. మెక్సీకోకు చెందిన కార్లా సైజా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకున్నారు. రాకెట్ బాయ్స్ మూవీకి జిమ్ సర్బ్ కూడా నామినేషన్ వేశారు. యూకేకు చెందిన స్టార్ మార్టిన్ ఫ్రీమాన్ ఆ అవార్డు దక్కింది. ఏక్తా కపూర్ మాత్రం ఇంటర్నేషనల్ డైరెక్టర్ విభాగంలో అవార్డును గెలుచుకున్నారు.
నటుడు, మ్యూజిక్ కంపోజర్
వీర్ దాస్ కామెడీయన్ మాత్రమే కాదు.. నటుడు, 35 విభాగాల్లో ప్రావీణ్యం ఉన్న సంగీత దర్శకుడు, 100 స్టాండప్ షో చేశారు. 18 సినిమాలు, 8 టీవీ షోలు, 6 కామెడీ స్పెషల్స్ చేశారు. ఢిల్లీ బెల్లీ మూవీకి సినీ గోయర్స్ అవార్డు వచ్చింది. దీంతోపాటు గో గోవా గోన్ మూవీలో ఫిల్మ్ ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కోసం నామినేట్ అయ్యాడు. ఇలా తనలోని నటనకు, హాస్యాన్ని అభిమానులకు పంచి ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంటున్నారు.