తాను ఎవరినైనా బాధించి ఉంటే మన్నించాలంటూ కంగనా రనౌత్(Kangana Ranaut) కోరుకుంది. తన శత్రువులు తనను విశ్రాంతి తీసుకోనివ్వకుండా చేశారని, తాను ఎంత విజయం సాధించానన్నది ముఖ్యం కాదని, తనను తన పాదాలపై నిల్చుని విజయ పథంలో నడిచేలా చేశారని, అటువంటి వారందరికీ కృతజ్ఞురాలినని కంగనా రనౌత్ తెలిపారు.
బాలీవుడ్(Bollywood) బ్యూటీ కంగనా రనౌత్(Kangana Ranaut) నేడు 36వ పుట్టినరోజును చేసుకుంటోంది. ఈ సందర్భంగా కంగనా తన ఇన్ స్టా(Instagram)లో తనను అభిమానించేవారిని, ఫాలోవర్స్ ను, ద్వేషించేవారిని ఉద్దేశించి పోస్ట్ చేసింది. తనకు మద్దతుగా నిలిచిన తల్లిదండ్రులకు, తనకు బోధించిన గురువులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది. ఆ తర్వాత తనను ద్వేషించే వారిని ఉద్దేశించి పలు విషయాలను పంచుకుంది.
తాను ఎవరినైనా బాధించి ఉంటే మన్నించాలంటూ కంగనా రనౌత్(Kangana Ranaut) కోరుకుంది. తన శత్రువులు తనను విశ్రాంతి తీసుకోనివ్వకుండా చేశారని, తాను ఎంత విజయం సాధించానన్నది ముఖ్యం కాదని, తనను తన పాదాలపై నిల్చుని విజయ పథంలో నడిచేలా చేశారని, అటువంటి వారందరికీ కృతజ్ఞురాలినని కంగనా రనౌత్ తెలిపారు.
తన సిద్ధాంతం చాలా సులభమని, తన ప్రవర్తన, ఆలోచనలు చాలా సాధరణమైనవి, అందరికీ మంచి జరగాలనే తానెప్పుడూ కోరకుంటానని, దేశ సంక్షేమం కోసం ఎప్పుడూ మాట్లాడుతుంటానని, ఎవరినైనా బాధపెట్టి ఉంటే వారందరి క్షమాణపలు చెబుతున్నానని కంగనా రనౌత్(Kangana Ranaut) తెలిపారు.