ఇలియానా.. ఇప్పుడంటే ఏదో సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆమె చర్చించుకుంటున్నాం గానీ.. ఒకప్పుడు అమ్మడి అందానికి దాసోహం కాని హీరో లేడు. ఇప్పటికీ ఇలియానాను కొట్టే ఫిగర్ టాలీవుడ్లో లేదనే చెప్పాలి. నాజుకు నడుము సుందరిగా తెలుగు కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది ఇలియానా అయితే ప్రస్తుతం ఇల్లీ బేబి షాకుల మీద షాకులు ఇస్తునే ఉంది. కానీ అసలు మ్యాటర్ మాత్రం చెప్పడం లేదు.
Ileana:గత నెలలో ప్రెగ్నెన్సీని ప్రకటించి షాక్ ఇచ్చింది ఇలియానా (Ileana). దాంతో అమ్మడు కూడా నయనతార లాగే ఏదో సరోగసి ప్లాన్ చేసినట్టే ఉందని అనుకున్నారు. లేకపోతే.. అసలు పెళ్లి కాకుండానే తల్లి కావడం ఏంటి? అంటూ ఇప్పటికీ ఆ న్యూస్ వైరల్ అవుతునే ఉంది. ఇక ఇప్పుడు బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసి మరో షాక్ ఇచ్చింది గోవా బ్యూటీ. ఇంట్లోనే డైనింగ్ టేబుల్ వద్ద బ్లాక్ డ్రెస్‌లో నిల్చొని ఫోటోలు దిగింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. బేబీ బంప్ అలర్ట్ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఆ ఫోటో వెనుక ఉన్న తన స్నేహితుడిని ప్రశంసిస్తూ క్రెడిట్ కూడా ఇచ్చింది. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. అసలు మ్యాటర్ ఎందుకు చెప్పడం లేదంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
పెళ్లి ముచ్చట చెప్పలేదు సరే.. ఇప్పుడైనా నీ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పమని అడుగుతున్నారు. కానీ ఇల్లీ బేబి (Ileana) మాత్రం ఈ విషయాన్ని బయట పెట్టడం లేదు. దీన్ని కూడా అమ్మడు సర్ప్రైజ్లా ప్లాన్ చేస్తుందా? అని అంటున్నారు. అయితే బాలీవుడ్ టాక్ ప్రకారం ఇలియానా (Ileana).. కత్రినా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. బహుశా ఇలియానా (Ileana) బిడ్డకు తండ్రి అతడే అయి ఉండవచ్చు.. అనే టాక్ నడుస్తోంది. అయితే ఎలాగూ ఇలియానా (Ileana) ప్రెగ్నేన్సి గురించి ఓపెన్ అయిపోయింది కాబట్టి.. నెక్స్ట్ అప్డేట్ హస్బెండ్ గురించే చెబుతుందేమో చూడాలి.