I will do a small role in the movie 'Spirit'.. Ranbir Kapoor
Prabhas: సలార్ సినిమాతో ప్రభాస్‌ను పీక్స్‌లో చూడబోతున్నాం. కానీ.. స్పిరిట్‌లో ప్రభాస్ (Prabhas) ఎలా కనిపించబోతున్నాడనేది ఊహించుకుంటే.. వెన్నుకు వణుకు పుట్టేలా చేస్తోంది యానిమల్ ట్రైలర్. అర్జున్ రెడ్డి తర్వాత హిందీ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). లేటెస్ట్గా యానిమల్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. బాలీవుడ్ సైతం భయపడేలా చేసింది. ఈ సినిమాలో అసలు సిసలైన్ వైలెన్స్ అంటే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు సందీప్. అందుకు ట్రైలర్‌ను జస్ట్ శాంపిల్ మాత్రమేనని చెప్పొచ్చు. ఒక్కో షాట్లో రణ్‌బీర్ కపూర్‌ను చూస్తే గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మరి దీనికే ఇలా ఉంటే.. నెక్స్ట్ సందీప్ చేయబోయే ‘స్పిరిట్’ ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి.
గతంలోనే ఎప్పుడో ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు సందీప్ రెడ్డి. ఇందులో ప్రభాస్‌ను భయంకరమైన పోలీస్ ఆఫీసర్‌గా చూపించబోతున్నాడు సందీప్. చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌నే ఈ రేంజ్లో చూపిస్తే.. డైనోసర్ లాంటి ప్రభాస్ కటౌట్‌కి ఇచ్చే ఎలివేషన్ ఎలా ఉంటుందోనని.. ఇప్పటి నుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు అభిమానులు. పైగా ఈ సినిమాలో తనకు ఏదైనా చిన్న రోల్ ఇచ్చిన సరే.. చేస్తానని చెప్పుకొచ్చాడు రణ్‌బీర్. అలాగే.. స్పై యూనివర్స్ లాగే గ్యాంగ్‌స్టర్ యూనివర్స్ కూడా చేయండి.. అని సందీప్‌కు చెప్పగా.. చూద్దాం అని చెప్పుకొచ్చాడు. దీంతో స్పిరిట్ హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. 2024 పెప్టెంబర్లో స్పిరిట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు సందీప్. 2025లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు. మరి సందీప్ లాంటి వైలెంట్ డైరెక్టర్ ప్రభాస్‌ను ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.