»I Did No Wrong Sobhita Dhulipala On Dating With Naga Chaitanya
Sobhita dhulipala: నేను తప్పు చేయలేదు
చాలా కాలం క్రితం నాగ చైతన్య అక్కినేని(naga chaitanya), శోభిత దూళిపాళ(Sobhita dhulipala) ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో ఈ ఇద్దరు నటుల మధ్య ఏమి జరుగుతుందనే దానిపై అనేక పుకార్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఈ అమ్మడు పుకార్లపై స్పందించింది. ప్రస్తుతానికి నేను నా పని మీద మాత్రమే దృష్టి పెడుతున్నాను. నా వ్యక్తిగత జీవితంపై ప్రచారంలో ఉన్న రూమర్లను పట్టించుకోనని వెల్లడించింది.
హీరో నాగచైతన్య(naga chaitanya), హీరోయిన్ శోభిత ధూలిపాళ(Sobhita dhulipala) డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం కొన్ని రోజులుగా నడుస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు వీరిద్దరూ కలిసి షికార్లు చేస్తున్నారంటూ ఫోటోలు కూడా వచ్చాయి. రోజు రోజుకీ ఈ ప్రచారాలు పెరిగిపోడంతో వాటికి శోభిత చెక్ పెట్టారు. ఇటీవల చైతన్య అవన్నీ రూమర్స్ అని ఇండైరెక్ట్ గా చెప్పగా, తాజాగా శోభిత కూడా రియాక్ట్ అయ్యారు.
తనకు అసలు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పింది. తాను ఏ తప్పు చేయలేదని పేర్కొంది. తాను తప్పు చేయనప్పుడు మీడియా ముందకు వచ్చి స్పందించాల్సిన అవసరం లేదు కదా అంది. తనకు ఈ విషయంపై మాట్లాడాలని అనిపించలేదని, అందుకే మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చింది. తాను ఏ తప్పు చేయలేదని తనకు తెలుసని, జీవితం(life)లో మంచిగా, ప్రశాంతంగా ఎలా ఉండాలి అనే విషయంపై తాను ఫోకస్ పెడతానంటూ చెప్పడం విశేషం.
ఇక తన సినిమాల(movies) విషయానికి వస్తే, మంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పింది. తనకు చిన్నతనం నుంచి డ్యాన్స్ అంటే ఇష్టమని, తాను క్లాసికల్ డ్యానర్ అని చెప్పింది. మణిరత్నం సినిమా ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డ్యాన్స్ చేయడం తన కల అని, అది నేరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది.
ఇక, తనపై వచ్చే రూమర్స్ ని తాను పట్టించుకోనని చెప్పకనే చెప్పింది. ఇలా తనపై వస్తున్న పుకార్లను లైట్ తీసుకుంది శోభిత. మిగతా హీరోయిన్లతో పోలిస్తే, తనపై పుకార్లు చాలా తక్కువగా వస్తుంటాయని, ఈ విషయంలో దేవుడి(god)కి థ్యాంక్స్(thanks) చెప్పింది.