తాను ప్రెగ్నెంట్ కాదని మరోసారి మిహీకా బజాజ్ స్పష్టంచేశారు. ఇటీవల మిహీకా పోస్ట్ చేసిన ఫోటోల్లో లావుగా కనిపించడంతో సందేహాం వచ్చింది. దీంతో మిహీకా క్లారిటీ ఇచ్చారు.
‘I'm Not Pregnant’ Once Again Miheeka Bajaj Clarify
Miheeka Bajaj Rana:టాలీవుడ్ నటుడు రానా (Rana) -మిహీకా బజాజ్ (Miheeka Bajaj) దంపతుల శుభావార్తపై ఒక్కటే చర్చ. అందుకు కారణం ఉంది. ఇటీవల మిహీకా బజాజ్ (Miheeka Bajaj) బరువు పెరిగారు. సోషల్ మీడియాలో మిహీకా పోస్ట్ చేసిన ఫోటోలను చూస్తే అర్థం అవుతోంది. అందుకే రానా (rana) దంపతులు పేరంట్స్ కాబోతున్నారని రూమర్లు జోరుగా వస్తున్నాయి.
రూమర్లపై మిహీకా (Miheeka) మరోసారి స్పందించారు. తాను తల్లి కావడం లేదని పేర్కొన్నారు. తన ఫోటోలు (photo) చూసి తప్పుగా అర్థం చేసుకున్నారని కామెంట్ చేశారు. పెళ్లి (marriage) చేసుకుని తాను సంతోషంగా ఉన్నాను.. కాస్త బరువు (weight) పెరగడంతో తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు. నిజంగా గర్భవతిని (pregnant) అయితే తప్పకుండా తెలియజేస్తానని.. దాచి పెట్టబోనని చెప్పారు.
ప్రస్తుతం తన దృష్టి మెంటల్ హెల్త్‌కు (mental health) సంబంధించిన ప్రాజెక్ట్‌పై ఉందన్నారు. స్క్రీన్ (screen) మీద కనిపించే ఉద్దేశం ఏదీ లేదని స్పష్టంచేశారు. మిహీకాను రానా 2020లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లై మూడేళ్లు కాగా.. అందుకే శుభ వార్త అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. దీంతో మిహీకా బజాజ్ స్పందించారు. అబ్బే అదేం లేదని క్లారిటీ ఇచ్చారు.