నటి సోనమ్ కపూర్‌కు దగ్గుబాటి రానా క్షమాపణలు చెప్పారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సోనమ్ గురించి పరోక్షంగా రానా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకీపారేయడంతో రానా.. ట్వీట్ చేసి చల్లార్చే ప్రయత్నం చేశారు.
Rana: దగ్గుబాటి రానా (Rana) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. కింగ్ ఆఫ్ కోథా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నేచురల్ స్టార్ నానితోపాటు రానా హాజరయ్యారు. దుల్కర్ సల్మాన్‌కు చాలా ఓపిక.. ఓ సారి సినిమా షూటింగ్‌కు వెళ్లాను. ఓ స్టార్ హీరోయిన్ చాలా సమయాన్ని వృథా చేసింది. ఆమె కోసం దుల్కర్ ఎండలో వేచి చూస్తున్నాడు. తన భర్తతో షాపింగ్ గురించి మాట్లాడుతోంది. అదీ చూసి కోపం వచ్చింది.. చేతిలో ఉన్న వాటర్ బాటిల్ విసిరేశానని చెప్పారు. దుల్కర్ ప్రశాంతంగా షూటింగ్ పూర్తి చేశాడని రానా (Rana) వివరించారు.
నిజానికి అప్పుడు రానా (Rana) హీరోయిన్ పేరును ప్రస్తావించలేదు. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ హీరోయిన్ అని చెప్పడంతో అందరికీ సోనమ్ అని అర్థమైంది. వారిద్దరూ కలిసి జోయా ఫ్యాక్టర్ మూవీలో నటించారు. దీంతో ఆమె అనుకొని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోనమ్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో రానా మళ్లీ స్పందించాడు. ఈ సారి ట్విట్టర్ వేదికగా ఏం జరిగిందో చెప్పారు.
I am genuinely troubled by the negativity that has been aimed at Sonam due to my comments, that are totally untrue and were meant entirely in a light-hearted manner. As friends, we often exchange playful banter, and I deeply regret that my words have been misinterpreted. I take…
తన కామెంట్లను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. తనను ట్రోల్ చేస్తుంటే ఇబ్బందిగా ఉంది. మేమందరం ఫ్రెండ్స్.. దుల్కర్, సోనమ్ అంటే తనకు ఎంతో గౌరవం, తన మాటల వల్ల సోనమ్ ఇబ్బందికి గురయ్యారు. అందుకే క్షమాపణ చెబుతున్నాను. ఇప్పటితో వివాదానికి ముగింపు పలుకుతారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. సో.. రానా (Rana) చేసిన వ్యాఖ్యలతో రేగిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. మరీ ఫ్యాన్స్, నెటిజన్లు ఊరుకుంటారో లేదో చూడాలీ.