Hrithik roshan తన క్రష్ అంటోన్న మీనా.. పెళ్లయ్యిందని తెలిసి గుండె పగిలిందంటూ?
Hrithik roshan:నటి మీనా (meena) ఇప్పుడు మళ్లీ బిజీగా అవుతున్నారు. భర్త విద్యాసాగర్ (vidya sagar) చనిపోయిన తర్వాత.. ఇప్పుడిప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు. మీనా (meena) రెండో పెళ్లిపై అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. కన్నడ నటుడు సుదీప్‌ను (sudeep) పెళ్లాడతారని గాసిప్స్ వినిపించాయి. ఆ తర్వాత దాని ఊసేలేదు. ఇటీవల తమిళ చానెల్ ఇంటర్వ్యూలో మీనా (meena) ఆసక్తికర వివరాలను తెలియజేశారు.
Hrithik roshan:నటి మీనా (meena) ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు. భర్త విద్యాసాగర్ (vidya sagar) చనిపోయిన తర్వాత.. ఇప్పుడిప్పుడు సినిమాల్లో నటిస్తున్నారు. మీనా (meena) రెండో పెళ్లిపై అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. కన్నడ నటుడు సుదీప్‌ను (sudeep) పెళ్లాడతారని గాసిప్స్ వచ్చాయి. ఆ తర్వాత వాటి ఊసేలేదు. ఇటీవల తమిళ చానెల్ ఇంటర్వ్యూలో మీనా (meena) ఆసక్తికర వివరాలను తెలియజేశారు. ఆ వివరాలు మీ కోసం.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (hrithik roshan) అంటే తనను చాలా ఇష్టమట. ఇదే విషయం ఇంటర్వ్యూ సమయంలో మీనా చెప్పారు. తాను హృతిక్ (hrithik) లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని అమ్మతో కూడా చెప్పానని వివరించారు. హృతిక్ ‘కహోనా ప్యార్ హై’ మూవీతో బాలీవుడ్లో తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. దేశవ్యాప్తంగా అతనికి అభిమాన సంఘాలు పుట్టుకొచ్చాయి.
తన చిన్ననాటి స్నేహితురాలు సుజానే ఖాన్‌ను హృతిక్ (hrithik) పెళ్లి (marriage) చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా.. ఆ దంపతులు విడిపోయారు. హృతిక్ (hrithik) పెళ్లి విషయం తెలిసి మీనా (meena) గుండె పగిలిందట. తాను అంతలా హృతిక్‌ను (hrithik) ఆరాధించానని ఇంటర్వ్యూలో చెప్పింది. అతనికి పెళ్లి అయ్యే సమయానికి తనకు మ్యారేజ్ (marriage) కాలేదని చెప్పింది. ప్రతీ ఒక్కరికీ ఎవరో ఒకరు క్రష్ (crush) ఉంటారు.. అలా తనకు హృతిక్ (hrithik) అంటే క్రష్ అని చెప్పేసింది.
భర్త విద్యాసాగర్ చనిపోయిన బాధ మరచిపోయేందుకే సినిమాలు ఒప్పుకుంటున్నానని మరో ప్రశ్నకు మీనా సమాధానం చెప్పారు. ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ మూవీలో మీనా నటించిన సంగతి తెలిసిందే. మీనా(meena) -విద్యాసాగర్ (vidya sagar) దంపతులకు నైనిక అనే పాప కూడా ఉంది. ఆ చిన్నారి తెలుగులో ‘పోలీస్’ అనే మూవీలో నటించి.. మెప్పించింది.