»How To Be Happy After Marriage Abhisheks Advice To Vicky Kaushal
Abhishek Bachchan:పెళ్లైన తర్వాత సంతోషంగా ఎలా ఉండాలి.. విక్కీ కౌశాల్కు అదిరిపోయే సలహా
వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా.. ఇది మన సినిమా వాళ్లు, పెద్దలు చెప్పే మాట. వర్మ లాంటి భాషలో చెప్పాలంటే.. అస్సలు పెళ్లే వద్దంటాడు. లైఫ్ అన్నాకా అన్నీ ఉండాలి. పెళ్లి చేసుకోకపోతే జీవితానికి అర్థం లేదని నారాయణ మూర్తి లాంటి సీనియర్ బ్యాచ్లర్స్ చెబుతుంటారు. మరి పెళ్లైన తర్వాత ఎలా సంతోషంగా ఉండాలి అంటే.. దానికి అదిరిపోయే సలహా ఇచ్చాడు అభిషేక్ బచ్చన్.
How to be happy after marriage.. Abhishek's advice to Vicky Kaushal
Abhishek Bachchan: టాలెంటెడ్ హీరో విక్కీ కౌశాల్ ( Vicky Kaushal), స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (katrina kaif) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. విక్కీ, కత్రినా వివాహం 2021 డిసెంబర్ 9న రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. గతేడాది తమ మొదటి వార్షికోత్సవాన్ని చాలా గ్రాండ్‌గా జరుపుకున్నారు. మే 16న విక్కీ కౌశాల్ 35వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. కత్రినాతో పెళ్లికి (marriage) ముందు జరిగిన ఓ విషయాన్ని పంచుకున్నాడు విక్కీ. 2018లో బ్రైడ్స్ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పెళ్లి చేసుకోబోతున్నవారికి ఏ సలహా ఇస్తారని హీరో అభిషేక్ బచ్చన్‌ని అడగ్గా.. అదిరిపోయే సలహా ఇచ్చాడని అన్నాడు.
పెళ్లయ్యాక.. పడుకునే ముందు, నిద్రలేచిన వెంటనే సారీ చెబితే చాలు.. మీరు నిజంగా సంతోషంగా ఉంటారు.. అన్ని అన్నారు. గతంలో అభిషేక్, ఐశ్వర్యరాయ్ మధ్య విభేదాలు వచ్చాయి.. చివరికి పరిష్కరించుకున్నామని.. తనతో చెప్పినట్టు చెప్పాడు. ఇదే ఇంటర్వ్యూలో, తనకు 30 ఏళ్లు వచ్చిన తర్వాత స్థిరపడాలని చెప్పుకొచ్చాడు విక్కీ కౌశాల్. ప్రస్తుతం విక్కీ రివీల్ చేసిన ఈ చిట్కా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సారా అలీ ఖాన్‌తో కలిసి నటించిన చిత్రం ‘జరా హాట్కే జరా బచ్ కే’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో, విక్కీని కత్రినా కంటే మంచి వ్యక్తిని మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. దీంతో విక్కీ నవ్వుతూ ఆన్సర్ చేశాడు. వచ్చే జన్మలో కూడా కత్రినాను విడిచిపెట్టనని చెప్పాడు. ఇక URI సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విక్కీ లేటెస్ట్ ఫిల్మ్ జరా హాట్కే జరా బచ్ కే రిలీజ్‌కు రెడీ అవుతోంది.