కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా అనగానే.. ఎగిరి గంతేశారు మెగా ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే శంకర్ స్పీడ్ చూసి.. అనుకున్న దానికంటే ముందే ఈ సినిమా థియేటర్లోకి వస్తుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా.. ఆగిపోయిన ఇండియన్2ని తిరిగి లైన్లోకి తీసుకున్నాడు శంకర్. విక్రమ్ సక్సెస్ జోష్‌లో ఉన్న కమల్ హాసన్ మొండి పట్టుకు.. శంకర్ రెండు సినిమాలను ఒకేసారి షూట్ చేయాల్సి వచ్చింది. నెల రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసుకొని.. బ్యాలెన్స్డ్గా షూటింగ్ చేస్తున్నాడు శంకర్. దాంతో ఆర్సీ 15 మరింత లేట్ అవడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు. సమ్మర్లో రిలీజ్ ఉంటుందని భావిస్తున్నా.. కష్టమేనని అంటున్నారు. ఇలాంటి సమయంలో హీరోయిన్ కూడా బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. గతకొంత కాలంగా ఈ హాట్ బ్యూటీ సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్లో ఉంది. ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లి పీఠలెక్కబోతున్నట్టు సమాచారం. రాజస్థాన్‌లో వీరి పెళ్లి జరగబోతుందని, ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నట్టు టాక్. దాంతో ఆర్సీ 15 షూటింగ్ మరింత లేట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే కియారా.. తన పెళ్లి గురించి శంకర్‌తో చెప్పిందని, కొన్ని రోజులు తనకు బ్రేక్ ఇవ్వాలని కోరిందట. ఒకవేళ ఇదే నిజమైతే.. మరి కొన్ని రోజులు ఆర్సీ 15 షూటింగ్‌కు లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే.. అసలు ఈ ఏడాదిలో ఆర్సీ 15 రిలీజ్ ఉంటుందా.. అనే డౌట్స్ వస్తున్నాయి. మరి ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.