hero Prabhas and director Maruthi@screen grab twitter
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అలాగే మరో ఇద్దరు, ముగ్గురు దర్శకులతో ప్రభాస్ టచ్‌లో ఉన్నాడని టాక్. అయితే వాటిలో ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా అధికారిక ప్రకటన రాలేదు. కానీ అతి త్వరలో ప్రభాస్ కొత్త సినిమా స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఇటీవల టీజర్ రిలీజ్ అయిన ఓం రౌత్ ‘ఆదిపురుష్’ 2023 జనవరి 12న రిలీజ్ కానుంది. అదే ఏడాదిలో సెప్టెంబర్ 28న, ప్రశాంత్ నీల్ ‘సలార్’ విడుదలవనుంది. ఇక ఆ తర్వాత 2023 ఎండింగ్ లేదా.. 2024 సంక్రాంతికి నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ స్టేజ్‌లో ఉన్నాయి.
ఇవి అయిపోగానే సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ మూవీ మొదలుపెట్టబోతున్నాడు ప్రభాస్. అయితే ఈ లోపే మారుతితో కమిట్ అయ్యాడు డార్లింగ్. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా.. అని ముందు నుంచి సందేహంగానే ఉంది. కానీ ఈ మధ్యే పూజా కార్యక్రమాలు జరుపుకుందని టాక్. ఇక ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అయిపోయిందట. ఈ నెలలోనే ఓ చిన్న షెడ్యూల్‌తో షూట్ స్టార్ట్ చేయబోతున్నారట.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న మారుతి.. వీలైనంత వేగంగా టాకీ పార్ట్ పూర్తయ్యేలా ప్లానింగ్ చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మరో హీరోయిన్ ఫిక్స్ అయిపోయిందని సమాచారం. ఇప్పటికే మాళవిక మోహనన్ ఓకే అయిందని వినిపించగా.. తాజాగా నిధి అగర్వాల్‌ను కన్ఫామ్ చేశారట. ప్రస్తుతం నిధి.. పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’లో నటిస్తోంది. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంది.