»Official Prabhas Maruti First Look And Title Date Fixed
అఫీషియల్.. ‘ప్రభాస్-మారుతి’ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ డేట్ ఫిక్స్!
ఎట్టకేలకు ప్రభాస్, మారుతి ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ డేట్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేశాడు డార్లింగ్.
ప్రస్తుతం థియేటర్లో డైనోసర్ దండయాత్ర నడుస్తోంది. సలార్, దేవరథగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే 500 కోట్ల క్లబ్లో ఎంటర్ అయింది సలార్. సెకండ్ వీకెండ్ వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవనుంది. ఇదిలా ఉంటే.. డైనోసర్ డార్లింగ్ మారే సమయం రానే వచ్చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో.. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందా? అని వెయిట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఫైనల్‌గా ఇప్పుడా ఆ సమయం రానే వచ్చేసింది.
న్యూ ఇయర్‌కు రెండు రోజుల ముందే సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చాడు మారుతి. ఇప్పటి వరకు డైనోసార్ ప్రభాస్‌ను చూసారు, ఇక నుంచి డార్లింగ్ ప్రభాస్‌ని చూసేందుకు సిద్ధం అవ్వండి.. అంటూ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ముహూర్తం ఫిక్స్ చేశారు. టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ని సంక్రాంతి కానుకగా రివీల్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనౌన్స్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో డైనోసర్ ప్లేస్‌లో డార్లింగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్‌ని చూస్తారని ముందు నుంచి చెబుతున్నాడు మారుతి. ఇప్పటి వరకు లీక్ అయిన పిక్స్‌లో ప్రభాస్ కలర్ ఫుల్‌గా ఉన్నాడు. ఇప్పుడు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ పోస్టర్‌ను కూడా ఇంద్ర ధనుస్సు కలర్స్‌తో నింపేశాడు మారుతి. అన్నట్టు ఈ సినిమాకు ముందు నుంచి రాజా డీలక్స్ అనే టైటిల్ వినిపిస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.